Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “బాహుబలి” సినిమాతో దేశ వ్యాప్తంగా తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి విజయంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాక దేశ విదేశాలకు ప్రభాస్ క్రేజ్ వ్యాపించింది. దీంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇదే తరుణంలో “బాహుబలి” తర్వాత పాన్ ఇండియా లెవెల్ లోనే ప్రభాస్ సినిమాలు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే వివిధ ఇండస్ట్రీలకు చెందిన టాప్ డైరెక్టర్లను ఇప్పుడు తాజాగా లైన్ లో పెట్టు కుంటూ వారి దర్శకత్వంలో సినిమాలు ఒప్పుకుంటూ సరికొత్త ఫార్ములాతో ప్రభాస్ ప్రతి ఇండస్ట్రీ కి దగ్గర అయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే “కేజిఎఫ్” లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” ప్రాజెక్ట్ చేస్తున్నవ్ ఇప్పుడు తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టు సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.
లోకేష్ కనకరాజు తమిళంలో టాప్ హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలు సాధించిన రికార్డు ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ప్రభాస్ తో ఆయన సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో ఈ వార్త సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ “రాధేశ్యాం” సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో పక్క ప్రశాంత్ నిల్ సినిమా కూడా చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టు అయిన వెంటనే లోకేష్ కనకరాజు సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!