దాదాపు 10 సంవత్సరాల తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు. 2010లో కరుణాకరణ్ దర్శకత్వంలో ప్రభాస్ డార్లింగ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రభాస్ నటించిన పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రమిది. తర్వాత ఆ స్థాయి ప్రేమకథాచిత్రంలో ప్రభాస్ నటించలేదు. దాదాపు పదేళ్లకు ప్రభాస్ అలాంటి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ లవ్‌స్టోరీ ఇది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను మే 10న జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్స్ చేసుకుంటున్నారు.