Prabhas: “బాహుబలి” విజయంతో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ మార్కెట్ ఏర్పడింది. ఇతర ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది డైరెక్టర్లు మరియు టాప్ మోస్ట్ నిర్మాణ సంస్థలు డార్లింగ్ తో సినిమాలు చేయటానికి క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు ఎక్కువ సినిమాలు ప్రభాస్ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో చేయడం తెలిసిందే. యు.వి.క్రియేషన్స్ రాకముందు ఎక్కువ సినిమాలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ “రాధేశ్యామ్” తో పాటు “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో “సలార్” అనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరో సారి ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అయినట్టు అది దిల్ రాజు బ్యానర్ లో అన్నట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా సమాచారం.
ప్రస్తుతం దిల్ రాజు చాలా వరకు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. రామ్ చరణ్ తో శంకర్ ప్రాజెక్ట్ ఇంకా అనేక పాన్ ఇండియా ప్రాజెక్టులు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఈ తరహాలో మరోసారి ప్రభాస్ తో భారీ సినిమా చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు దానికి దర్శకత్వం వహిస్తున్నది ప్రశాంత్ నీల్ అన్నట్లు సమాచారం.