Prabhas: పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో “రాధే శ్యామ్” సినిమా వాయిదా పడిన సంగతి తెలిసినదే. మరో వైపు ప్రభాస్ ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే, వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తన అభిమానులకోసం ఒక సినిమాని అతి తక్కువ సమయంలో పూర్తి చేసి ఖుషీ చేయనున్నాడట. ఈ సందర్భంగానే డైరెక్టర్ మారుతి విషయం బయటకు పొక్కింది.
Deepti Sunaina : షణ్ముక్ తో బ్రేకప్ తరవాత దీప్తి సునైనా తండ్రి సూపర్ నిర్ణయం.. ఇలాంటి తండ్రులు అందరికీ ఉండాలి.!
Prabhas: మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా?
అవుననే టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాడట. DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ లిమిటెడ్ కాల్షీట్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ పరిధిలోనే మారుతి ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో వైపు ప్రభాస్ అభిమానులు మాత్రం మారుతితో ప్రభాస్ సినిమా ఏంటి అని పెదవి విరుస్తున్నారు.
Samantha : ‘వాళ్ళు లేకపోతే చనిపొయే దాన్ని’ బాంబు లాంటి విషయం బయటపెట్టిన సమంత!
ఈ సినిమా పక్కా స్క్రిప్ట్ ప్రభాస్ చదివాడట!
అవును.. ఈ సినిమా పక్కా స్క్రిప్ట్ ప్రభాస్ చదివాడట. దాంతో సదరు సబ్జెక్టు పైన నమ్మకం కుదిరిన డార్లింగ్ ప్రభాస్ మారుతికి ఓ అవకాశం ఇవ్వడం తప్పులేదని డిసైడ్ అయ్యాడట. ఇకపోతే వీరిద్దరి మధ్య సినిమా అంటే కమర్షియల్గా పెద్ద రిస్క్ అని అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం మారుతి మీద మంచి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి కలయిక ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి!