Prabhas Rajamouli: ఇండియాలో తిరుగులేని కాంబినేషన్ ప్రభాస్-రాజమౌళి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి తెలుగు సినిమా సత్తా తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ మోరల్ లెవెల్ లోకి తీసుకెళ్లడం జరిగింది. జక్కన్న రాజుని ప్రజలు ఎలా చూడాలి అని అనుకుంటారో.. ఆ రీతిగా అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ లో ప్రభాస్ నీ .. నిండు రాజు గా చూపించాడు. అంత మాత్రమే కాక భారతీయ చలనచిత్ర రికార్డులను రాజమౌళి పగలగొట్టాడు.
ఇదే సినిమా హాలీవుడ్ వాళ్లు తీయాలంటే కనీసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేది. కానీ కొన్ని వందల కోట్లు దాదాపు 300 కోట్లు కూడా దాటకుండా… వేల కోట్లు కలెక్షన్లు వచ్చే సినిమా ని రాజమౌళి తెరకెక్కించి… ప్రపంచ సినీ ప్రేమికులకు ఔరా అనిపించేలా చేశాడు. ఇటువంటి తరుణంలో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందో అని చాలామంది బయట డిస్కషన్లు చేసుకుంటూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో మరికొద్ది రోజుల్లో పాన్ ఇండియా నేపథ్యంలో కంటే పాన్ వరల్డ్ తరహాలో రాజమౌళి సరికొత్త స్క్రిప్టు రెడీ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
యుద్ధం సన్నివేశాలు హైలైట్ గా తీయాలంటే… థియేటర్ లో కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుడు రోమాలు నిక్కబొడుచుకోవలంటే… రాజమౌళి పనితనం వేరు. ఇప్పుడు ఇదే రీతిలో .. రాజమౌళితో సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అయినట్లు తెలుస్తోంది. మేటర్ లోకి వెళితే రాజేశం ట్రైలర్ రిలీజ్ ఈ సందర్భంగా ముంబైలో మీడియాతో మాట్లాడిన ప్రభాస్ రాజమౌళి తో ఒక చిన్న స్టోరీ ఐడియా పై డిస్కర్షన్ జరిగింది ఖచ్చితంగా సినిమా ఉంటుంది అని పేర్కొన్నారు. కానీ ఎప్పుడు చేస్తామో కచ్చితంగా చెప్పలేం. కానీ మళ్లీ మా కాంబినేషన్ రిపీట్ అవుతుంది అని ప్రభాస్ తెలియజేశాడు. ఈ నేపథ్యంలో బాహుబలి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడంతో… రాజమౌళి పాన్ వరల్డ్ తరహాలో ప్రభాస్ కోసం ఒక సరి కొత్త స్క్రిప్ట్ రెడీ చేసినట్లు టాక్ నడుస్తోంది.