సినిమా

Prabhas: సిగరెట్ వెలిగిస్తూ ద‌ర్శ‌న‌మిచ్చిన‌ ప్ర‌భాస్‌.. నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

Share

Prabhas: నేష‌నల్ స్టార్ ప్ర‌భాస్ తాజాగా సిగ‌రెట్ వెలిగిస్తూ ద‌ర్శ‌న‌మిచ్చారు. అయితే రియ‌ల్‌గా కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈయ‌న ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ సిరీస్‌తో సూప‌ర్ పాపుల‌ర్ అయిన ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

హోంబలి ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే కొంత షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. అయితే ఇంతంలోనే షూటింగ్ స్పాట్ లోని కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. వీటిల్లో ప్రభాస్ మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు.

అలాగే ఓ పిక్‌లో ప్ర‌భాస్ షాట్ కోసం సిగ‌రెట్ వెలిగింస్తూ క‌నిపించారు. దీంతో ఈ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే ఈ చిత్రానికి లీకుల‌ బెడ‌ద ఏమీ కొత్త కాదు. గ‌తంలో ఎన్నో సార్లు ఈ సినిమా షూటింగ్ లోకేష‌న్స్ నుంచి ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. అప్ప‌టి లీకుల‌తో ఎంత‌గానో బాధ‌ప‌డ్డ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌.. ఈ సారి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఎందుకంటే, `కెజియఫ్ 2` విజయం తర్వాత… ప్రభాస్ అభిమానుల్లో స‌లార్‌పై కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఈ నేప‌థ్యంలోనే ఎన్ని పిక్స్ లీక్ అయినా బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భాస్ విధ్వాంసం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో.. ప్ర‌భాస్ మునుపెప్పూడు క‌నిపించ‌నంత మాస్ మేకోవ‌ర్‌లో అల‌రించ‌బోతున్నారు. అలాగే త్వ‌ర‌లోనే ఈ మూవీ టీజ‌ర్ బ‌య‌ట‌కు రాబోతోంది.


Share

Related posts

వేట మొదలు పెడుతున్నాడు

Siva Prasad

Pawan Kalyan: మహేష్ బాబు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్..?

sekhar

Vijaydeverakonda: దసరా పండుగ రోజు..ఫ్యాన్స్ కి.. విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్లు..!!

sekhar