యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఇంతకు వారి అసంతృప్తికి కారణమేంటో తెలుసా? వాళ్ల అభిమాన హీరో సినిమాకు సంబంధించిన సినిమా గురించి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడమే. ప్రభాస్ `సాహో` విడుదలైంది. ఆశించిన మేర సక్సెస్ కాలేదు. దీని తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ లవ్‌స్టోరీ చేస్తున్నాడు. 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కిన విషయాలే. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా #we want prabhas 20 update అంటూ ట్రెండింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మరి దీనికి యువీ క్రియేషన్స్ బ్యానర్‌ను యాడ్ చేసింది. మరి దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.