Prabhas: డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాహుబలి సినిమా తరువాత డార్లింగ్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతన్ని పాన్ ఇండియన్ స్టార్ అని పిలుస్తున్నారు అంటే అతని క్రేజ్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది మరి. అయితే ప్రస్తుతం ప్రభాస్ నుంచి పూర్తిగా రొమాన్స్ మిళితమైన ఓ అందమైన ప్రేమకథ రాబోతుంది. రాధాకృష్ణ కుమార్ ప్రభాస్‌లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. రాధే శ్యామ్ మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో అంచనాలు పతాక స్థాయికి చేరాయి.
Prabhas: ప్రభాస్ – రాజమౌళి కొత్త సినిమా టైటిల్ ఇదే!
Prabhas: ఆ సీన్స్ చేసేటప్పుడు ప్రభాస్ కి బాగా ఇబ్బంది కలిగిందట!
ఇకపోతే ఈ సినిమాలో హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో నటిస్తున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. ఇప్పటి వరకు తెలుగు హీరోలలో ఎవరూ చేయని పాత్ర ఇది. ఇక్కడే వుంది అసలు చిక్కు. బేసిగ్గా యాక్షన్ హీరో కావడంతో రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి మనోడు సిగ్గు పడుతుంటాడు. ఎప్పుడూ విలన్స్ భరతం పట్టడమే తప్ప, హీరోయిన్ల వెంటపడి ప్రేమించే పాత్రలు ఎక్కువగా చేయలేదు ప్రభాస్. కానీ ఇపుడు తప్పలేదు మరి. ఈ సినిమాలో పాత్ర పరిధి మేర ట్రెండ్‌కు తగ్గట్లు ముద్దు సీన్స్ కూడా కీలకమే.
Prabhas: సైలెంట్ గా ఉండే ప్రభాస్ జగన్ పై సెటైర్ వేసాడు
బాగా సిగ్గుపడ్డాడట!
ఇక మనోడు కాస్త అక్కడ ఇబ్బంది పడ్డాడట. ఇందులో కిస్సింగ్ సీన్స్ బాగా గాఢంగా వుంటాయని చెబుతున్నారు. పూజా హెగ్డేతో ముద్దు సీన్లతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు డార్లింగ్ కి బాగా చిరాకు కలిగిందట. రాధే శ్యామ్ అనేది పూర్తిగా ప్రేమకథ కావడంతో దర్శకుడు చెప్పిన దానికి ఓకే చెప్పడం తప్ప మరో ఛాయస్ లేకుండా పోయింది మన ప్రభాస్ కి. అక్కడితో ఆగకుండా హీరోయిన్లకు ఎలా ఉంటుందో నాకు తెలీదు గాని, ముద్దు సన్నివేశాలు అంటే నాకు మాత్రం చాలా ఇబ్బంది అని చెప్పాడట.