Prabhas: “రాధేశ్యాం” సినిమాల్లో ఎక్కువ బడ్జెట్ దానికే ఖర్చు అయిందట..??

Share

Prabhas: జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా చేస్తున్న సినిమా “రాధేశ్యాం”. యువి క్రియేషన్స్, కృష్ణంరాజు నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత ఏడాదికి పైగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అనే టాక్ ఇండస్ట్రీలో మొదటి నుంచి వినపడుతూ ఉంది. యాక్షన్ ప్లస్ రొమాంటిక్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బడ్జెట్ లో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు చేశారట.

Prabhas Radhey shyam movie Latest News
Prabhas Radhey shyam movie Latest News

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమాలో లేని విజువల్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్. సినిమా షూటింగ్ చాలా వరకూ ఇటలీ ప్రాంతంలో జరిగింది. అక్కడ ఉండే సీనరీస్ సినిమాలో బాగా హైలైట్ అవుతాయని..యాక్షన్ సన్నివేశాలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ఫస్ట్ టైం పూజా హెగ్డే తో ప్రభాస్ చేస్తూ ఉండటంతో.. అది కూడా పూర్తి ప్రేమ కథ నేపథ్యంలో సినిమా కావటంతో…“రాధేశ్యాం” ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.

 

ఇప్పటికే సినిమాకు సంబంధించి చిన్నపాటి రిలీజైన వీడియో కి భారీ రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ సినిమా జూలై 31 వ తారీకు రిలీజ్ చేయాలని భావించినా గానీ ప్రస్తుతం పాండమిక్.. తీవ్రత అధికంగా ఉండటంతో రిలీజ్ డేట్ మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న “రాధేశ్యాం”..కీలక భాషలలో విడుదల కానుంది. 


Share

Related posts

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో భారీ టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్..!!

sekhar

Lock Down: సత్ఫలితాలు ఇస్తున్న లాక్‌డౌన్..! అక్కడ మరో వారం పొడిగింపు..!!

somaraju sharma

NTR Jayanthi: బాలకృష్ణ తన గాత్రంతో ఆలపించిన శ్రీరామ దండకం తో మరోసారి తన తండ్రిపై ప్రేమను చాటుకున్నారు..!!

bharani jella