Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో మాస్ ఫ్యాన్ బేస్ ఎక్కువ కలిగిన సినిమా “చత్రపతి”. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో ప్రభాస్ బాడీకి యాక్షన్ సన్నివేశాలు కి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కాసుల వర్షం కురిసాయి. సినిమాలో వాడి బాడీ బాక్స్ ఆఫీస్ డైలాగ్ అన్న మాదిరిగానే “చత్రపతి” బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులను సృష్టించింది.
ఇదిలా ఉంటే “చత్రపతి” సినిమా ప్రారంభంలో షిప్ లో పోరాట సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా అప్పట్లో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నా “రాధేశ్యామ్” సినిమాలో అదే తరహాలో షిప్ లో సన్నివేశాలు ఉంటాయని.. ముఖ్యంగా రొమాంటిక్ కాన్సెప్టుతో ప్రభాస్ పూజ హెగ్డే మధ్య దాదాపు అరగంట పాటు షిప్ లో ఉండే సన్నివేశాలు సినిమా మొత్తానికే హైలైట్ అవుతాయని లేటెస్ట్ న్యూస్ ఇండస్ట్రీలో వినబడుతుంది.
Read More: Prabhas: ప్రభాస్ బాడీ గురించి సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో..!!
వైలెన్స్ పరంగా కాకుండా రొమాంటిక్ తరహాలో సముద్రంలో సన్నివేశాలు చిత్రీకరించినట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ కావడంతో.. అనుకున్న దాని ప్రకారం జూలై మాసంలో పరిస్థితులను సద్దుమణిగి తే రిలీజ్ చేసేయాలని సినిమా నిర్మాతలు అనుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ మీడియా తరహాలో తెరకెక్కడం జరిగింది. పాతకాలం నాటి ప్రేమకథా నేపథ్యంలో ప్రభాస్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహాలో కనిపించనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?