Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌కు అమ్మాయిలంటే విపరీతమైన సిగ్గు, బిడియం ఉంటుందని ఆయన మొదటి సినిమా ఈశ్వర్ నుంచి ఉన్న టాక్. షాట్ అయిపోగానే హీరోయిన్ కు దూరంగా వెళ్ళి కూర్చుంటాడని పెద్దగా మాట్లాడడని అందరూ చెబుతుంటారు. కొత్త సినిమా మొదలైన చాలా రోజులకు గానీ, హీరోయిన్‌తో క్లోజ్ అవలేడని ప్రభాస్‌తో నటించిన హీరోయిన్స్, దర్శకులు చెబుతుంటారు. అయితే, ఇప్పుడు ప్రభాస్‌కు సంబంధించిన ఓ లేటెస్ట్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారందరూ ఇలా చేసింది ప్రభాసేనా అంటూ షాకవుతున్నారు.

- Read latest news in NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews subscribe our channel
హిందీలో వస్తున్న నాచ్‌బలియో సీజన్ 9 డాన్స్ షోలో ప్రభాస్ జడ్జ్‌గా పాల్గొన్నారు. బాలీవుడ్ లో ఈ షోకు మంచి ఆదరణ ఉంది. బాహుబలి సిరీస్ నుంచి ప్రభాస్‌కు హిందీ ఇండస్ట్రీలో పెరిగిన క్రేజ్ అసాధారణం. దాంతో ఈ షోకు ప్రభాస్ జడ్జ్‌గా వెళ్ళగానే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ షోకు సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్, యంగ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కూడా హాజరయ్యారు. అయితే, రవీనా టాండన్‌తో కలిసి ఈ షోలో ప్రభాస్ స్టేజ్ మీద స్టెప్పులేస్తా రని ఎవరూ ఊహించలేదు. రవీనా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘మొహ్రా’లోని సూపర్ హిట్ సాంగ్ టిప్పు టిప్పు బర్సా పానీ.
- Read latest news in NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews subscribe our channel
Prabhas: ఈ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.
ఈ పాట ఇప్పటికే అభిమానుల మ్యూజిక్ ప్లేయర్స్‌లో మోగుతూనే ఉంటుంది. ఇప్పుడిదే పాటకు మన డార్లింగ్ రవీనాతో కలిసి డాన్స్ చేశాడు. తెలుగులో ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన ఏ సినిమా ఆడియో ఫంక్షన్స్‌లో గానీ, సక్సెస్ సెలబ్రేషన్స్‌లో గానీ, హీరోయిన్‌తో కలిసి ఇలా డాన్స్ చేసింది లేదు. దాంతో ఇప్పుడు రవీనాతో కలిసి ప్రభాస్ చేసిన డాన్స్‌కు అవాక్కవుతున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ తెగ షేర్
చేస్తూ వైరల్ చేసేస్తున్నారు. కాగా, ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో ఒక సినిమా, స్పిరిట్ సినిమాలను చేస్తున్నాడు. ఇక రవీనా ఇటీవలే వచ్చిన కేజీఎఫ్ 2లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది.