Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిన తర్వాత సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. బాహుబలి 2 వంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో అర్జెంటుగా మంచి హిట్ కోసం డార్లింగ్ ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్టుకే”, మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” సినిమా చేస్తున్నారు. వీటన్నిటిలో “సలార్” పై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.
“కేజిఎఫ్” లాంటి రెండు భాగాల సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బాక్స్ ఆఫీసులను చెడుగుడు ఆడుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్” తీస్తుండటంతో… కచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో హిట్ అవ్వాలని ఆశిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28 అని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. హోమ్బెల నిర్మాణ సంస్థ… నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నెలకి కంప్లీట్ కానుంది. ఆ తరువాత విఎఫ్ఎక్స్ వర్కులు ప్రారంభం కానున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.
అయితే తాజాగా “సలార్” లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ వివరాలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. రేపటి నుంచి హైదరాబాదులో సుదీర్ఘకాలం పాటు షూటింగ్ జరుపుకోనుందట. ఇదే “సలార్” కి లాస్ట్ షెడ్యూల్ అని టాక్ నడుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి అప్ డేట్ ఇవ్వాలని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. చివరి షెడ్యూల్ లో కీలకమైన యాక్షన్స్ అన్ని వేషాలు చిత్రీకరించనున్నట్లు రామోజీ ఫిలిం సిటీ లో పెద్ద సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!