Prabhas: టాలీవుడ్ టాల్ అండ్ హేండ్ సమ్ హీరో డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమా సక్సెస్ విషయంలో డార్లింగ్ పాత్ర ఎంతో వుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ స్టార్ ఎవరన్నా వున్నారంటే అది మన ప్రభాస్ మాత్రమే. పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న ఏకైక హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలో ప్రస్తుతం లైనప్ లో ఉన్న సినిమాలకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి.
YS Jagan: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగనన్న సర్కార్ గుడ్ న్యూస్(యే)..కానీ
Prabhas: 20 నిమిషాల కోసం రూ.75 కోట్ల కహానీ..
ఇకపోతే ఓ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం ఒక స్టార్ దర్శకుడు ఏకంగా 75కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇక ఆ సినిమా ఏమిటో తెలుసుకోవాలని వుందా? అక్కడికే వస్తున్నా.. ఇపుడు డార్లింగ్ అభిమానులు ఫోకస్ ఎక్కువగా సలార్ సినిమాపైనే ఉంది. ఎందుకంటే ఆ సినిమాని KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో పాన్ ఇండియా యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు గనక. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలలో వైరల్ గా మారింది.
Rajamouli: రాజామౌళికి ఉన్న కన్ఫ్యూజన్స్ ‘రాధే శ్యామ్’ మేకర్స్ లేవు..ఇదిగో ప్రూఫ్
అది నిజమో కాదో తెలుసుకోండి మరి.!
సలార్ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాల విషయమై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాలా పక్కాగా వున్నాడట. అవును.. ఫైనల్ ఎపిసోడ్ యాక్షన్ సన్నివేశాల కోసం దాదాపు 75కోట్లు పైనే ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఇక ఆ సీన్స్ సినిమా చివరలో దాదాపు ఓ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వ్యవధిని కలిగి ఉంటాయట. అంత కస్టపడి, ఖర్చుచేసి తీసిన ఆ సీన్స్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో కాలమే నిర్ణయిస్తుంది.