Prabhas: టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తుంది. ప్రభాస్ పెళ్లిపై టాలీవుడ్‌లో చాలా వరకు పుకార్లు వినిపించాయి. నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటివరకు పలు ఇంటర్వ్యూలోనూ ఆయన పెళ్లి గురించి టాపిక్ తీసినప్పుడు వాటికి సిల్లీగా జవాబులు చెప్పి దూరమయ్యేవాడు. అయితే ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు కూడా చాలా పుకార్లు వినిపించాయి. మిర్చి సినిమా నుంచి ప్రభాస్-అనుష్కకు మధ్య ప్రేమ పుట్టిందని, అప్పటి నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బహుబలి సినిమా వరకు ఈ పుకార్లు కొనసాగాయి. ఆ తర్వాత ఉన్నట్టుంది అనుష్క ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత ప్రభాస్.. కృతి ససన్‌తో కలిసి ఆదిపురుష్ సినిమా చేశారు. ఈ సినిమా సమయంలో కృతి సనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది.

ఈ విషయంపై కృతి సనన్ కూడా స్పందించింది. చాలా వరకు ఇంటర్వ్యూలు, ఈవెంట్లల్లో ప్రభాస్ అంటే తనకు ఇష్టమని, హస్బెండ్ మెటిరియల్ అని చెప్పుకొచ్చింది. దాంతో కృతి సనన్‌తో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ రెండు విషయాలపై ప్రభాస్ స్పందించాడు. అనుష్క, కృతి సనన్ ఇద్దరూ తనకు మంచి స్నేహితులు అని చెప్పుకొచ్చాడు. అలాగే పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో సరదాగా వెల్లడించాడు.

రీజన్ చెప్పిన రాజమౌళి..
ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళితో మంచి బాండింగ్ ఉంది. ఇప్పటివరకు ప్రభాస్‌తో కలిసి పలు సినిమాలను డైరెక్ట్ చేశారు. అలాగే ఇద్దరు ఫ్యామిలీ పరంగా, వర్క్ పరంగా చాలా క్లోజ్‌గా ఉంటారు. అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి రివీల్ చేశాడు. ప్రభాస్‌కు చాలా బద్ధకం అని, సోమరితనం ఎక్కువ అని అన్నాడు. అందుకే ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదన్నారు. ఈ మాటలు విన్న ప్రభాస్ స్పందిస్తూ.. ‘అవును.. నాకు సోమరితనం ఎక్కువ. పిరికివాడిని, ప్రజలతో కలవలేను. నాకు ఈ మూడు సమస్యలు ఉన్నాయి. మనుషుల మధ్య నాకు అసౌర్యకరంగా ఉంటుంది. నాకు ఫ్రీడమ్ కావాలి. కొత్త వ్యక్తులతో కలవడానికి, వాళ్లతో మాట్లాడటానికి సమయం పడుతుంది. ఒకేసారి గుంపులో నిలబడినప్పుడు భయాందోళనకు గురవుతాను.’ అని చెప్పుకొచ్చాడు.
Prabhas Maruthi: ప్రభాస్ – మారుతి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది !?
కాగా, ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2892 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కల్కి అనేది పురాణాల ప్రకారం.. కలియుగం చివరల్లో విష్ణువు పదో అవతారం. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా భవిష్యత్‌లోకి తీసుకెళ్తుంది. అందుకే దీనిని టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్‌లో తీస్తున్నారు. ‘కామిక్ కాన్ – 2023’ వేడుకల్లో మేకర్స్ టైటిల్, గ్లింప్స్ విడుదల చేశారు