Prabhas: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచిలర్ హీరోలలో ఒకరు ప్రభాస్. “బాహుబలి” సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ సంపాదించిన తర్వాత అన్ని భారీ బడ్జెట్ సినిమాలే ప్రభాస్ చేస్తున్నాడు. ఇదే సమయంలో “బాహుబలి” తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే సినిమా చేస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా పై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మొదటి భాగం డిసెంబర్ 22వ తారీకు రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ కి తన పెదనాన్న కృష్ణంరాజు అంటే ఏనలేని గౌరవం అని అందరికీ తెలుసు.
తన వారసత్వాన్ని అందిపుచ్చుకొని “ఈశ్వర్” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ఎదుగుదలను చూసి కృష్ణంరాజు చాలాసార్లు గర్వపడిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో గత ఏడాది కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ చాలా ఎమోషనల్ కావడం తెలిసిందే. ఇదిలా ఉంటే కృష్ణంరాజు మరణించి ఏడాది కావడం జరిగింది. అయితే తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పై ఎమోషనల్ కామెంట్ చేశారు. విషయంలోకి వెళ్తే కృష్ణంరాజు బ్రతికున్న సమయంలో.. ప్రభాస్ పెళ్లి చేయాలనే అతని పిల్లలతో ఆడుకోవాలని ఎంతగానో ఆశపడ్డారు. అయితే పెళ్లి విషయం ప్రస్తావించినప్పుడల్లా ప్రభాస్ మాత్రం మమ్మల్ని ఎంతగానో నిరాశపరిచారు.
అప్పుడు చేసుకుంటాను ఇప్పుడు చేసుకుంటాను అంటూ మాకు నమ్మకద్రోహం చేశారు అని శ్యామలాదేవి ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్ కి పెళ్లి చేసి పిల్లలు పుడితే వారితో ఆడుకోవాలని తన భర్త యొక్క కోరిక అని భార్య శ్యామలాదేవి ఇంటర్వ్యూలో కామెంట్లు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అభిమానులు కూడా త్వరగా ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని చాలా ఆశ పడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఏజ్ 40కి పైగానే ఉంది. ప్రభాస్ తోటి హీరోలంతా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు కూడా కనేశారు. దీంతో డార్లింగ్ ప్రభాస్ కి కూడా త్వరగా పెళ్లి అవ్వాలని భావిస్తున్నారు.