Prabhas: “బాహుబలి” విజయంతో ప్రభాస్ కటౌట్ క్రేజీ వాయిస్.. ఇది హీరోయిజం అంటే అన్న రీతిలో భారతీయ చలన చిత్రంగా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ప్రభాస్ కెరియర్ ప్రారంభంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిమితం కాగా ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ పాకిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలకు కూడా లేని మార్కెట్ ప్రభాస్ కి అంతర్జాతీయంగా ఏర్పడింది. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా అంటే చాలామంది టాప్ డైరెక్టర్లు మరియు నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి నెలకొంది.
ఈ రీతిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శాసిస్తున్న ప్రభాస్ తన కెరియర్ లో ఓ సినిమాలో ఓ సన్నివేశం చేయడం కోసం తెగ టెన్షన్ పడినట్లు చెమటలు కూడా పట్టినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పూర్తి విషయంలోకి వెళ్తే టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ చక్రం సినిమా చేసిన సంగతి తెలిసిందే.
Read More: Prabhas: గడచిన రెండు సంవత్సరాలలో ప్రభాస్ రిజెక్ట్ చేసిన డైరెక్టర్ల లిస్టు..??
అయితే ఈ సినిమాలో గే క్యారెక్టర్ లో.. చేయాల్సిన టైంలో అనేక ఇబ్బందులు గురైనట్లు అసలు ఆ క్యారెక్టర్ గురించి అవగాహన లేదని… గే కల్చర్ అనేది ఇండస్ట్రీ రాకముందు వరకు తనకు ఏమీ తెలియదని.. ప్రభాస్ తెలిపాడు. అయితే ఆ సన్నివేశం చేయకుండా తప్పించుకోవాలని చూసినా కృష్ణవంశీ గారు చాలా స్ట్రిక్ట్ కావటంతో ఎట్టకేలకు.. ఆ సన్నివేశంలో నటించడం జరిగిందని చెమటలు పట్టేశాయి అని తన కెరియర్ లో అనేక సన్నివేశాలు చేసిన ఆగే క్యారెక్టర్ చేసిన టైములో పడిన ఇబ్బందులు మరి ఎప్పుడు పడలేదని ప్రభాస్ అప్పటి విషయాన్ని ఇటీవల తెలిపాడు.