Prabhas: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్.. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఊహించని విధంగా టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుని సీజన్ 2 కోసం ప్రేక్షకులను ఎదురుచూసేలాగా చేసింది.. సీజన్ 2 లో రాజకీయ నేతలతో పాటు సినీ స్టార్స్, డైరెక్టర్స్ ఈ షో కి వచ్చి ప్రేక్షకులను అలరించారు .. తాజాగా ప్రభాస్ ఈ షో కి రానున్న ప్రోమో రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది..
ఈ ప్రోమోలో ప్రభాస్ తన ఫ్రెండ్ రామ్ చరణ్ కి ఫోన్ చేయగా.. రామ్ ఏదో చెబుతూ ఉండగా ప్రభాస్ రే చరణ్ నువ్వు నా ఫ్రెండ్ వా లేక నా శత్రువ.. నా గురించి అన్నీ చెప్పేస్తున్నావ్ అని ప్రభాస్ నవ్వుతూ అంటాడు. ఇక ఇదే ఎపిసోడ్ కి ప్రభాస్ స్నేహితుడు సన్నిహితుడు హీరో గోపీచంద్ కూడా వస్తారు. గోపీచంద్ రాగానే ఇందాకే రామ్ చరణ్ తో ప్రభాస్ మాట్లాడాడు. కొన్ని విషయాల గురించి లీక్ ఇచ్చారు అని బాలకృష్ణ అనగానే.. వెంటనే ఆ మాటలకు గోపీచంద్ ఇంకేముంటుంది సార్ రాణి గురించి కదా అని అంటాడు గోపీచంద్ అని బాలకృష్ణ తో అంటాడు.. ప్రభాస్ కి కాబోయే రాణి అనుష్కని ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..
అయితే ఈ షోలో ప్రభాస్ అనుష్కతో బాలకృష్ణ చేశారని.. ఇండైరెక్టుగా ప్రభాస్ అనుష్కకి ప్రపోజ్ చేసినట్లు సమాచార. ఇది నిజమో కాదు త్వరలోనే తేలిపోనుంది. ప్రస్తుతానికి ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికైనా ప్రభాస్ అనుష్క ఇద్దరూ ఓపెన్ అవుతారా లేదా అనేది చూడాలి. ఈ క్రేజీ న్యూస్ మాత్రం ప్రభాస్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.