సినిమా

Prabhas: రూ.350 కోట్ల ఆఫ‌ర్‌.. ప్ర‌భాస్ పొర‌పాటున ఒకే చెబితే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోవ‌డం ఖాయం!

Share

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. కృష్ణం రాజు, జ‌గ‌ప‌తిబాబు, భాగ్యశ్రీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ప్యూర్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా నిర్మించారు.

ఈ పాన్ ఇండియా చిత్రం ఎప్పుడో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉన్నా.. కరోనా, ఇతర కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. ఇక ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న మేక‌ర్స్ గ్రాండ్‌గా విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ, ఇంత‌లోనే క‌రోనా దెబ్బ‌కు మ‌రోసారి వాయిదా ప‌డింది. ఇక‌పోతే గతంలో మాదిరిగానే మళ్లీ ఈ సినిమా ఓటీటీలోకి వెళ్లబోతోందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

నిజానికి ఇప్ప‌టికే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రాధేశ్యామ్ సినిమా ఓటీటీలో వ‌చ్చే ప్రస‌క్తే లేద‌ని.. ఖ‌చ్చితంగా థియేట‌ర్స్‌లోని రిలీజ్ అవుతుంద‌ని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ, తాజాగా ఈ సినిమాకు ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డైరెక్ట్ రిలీజ్ కోసం ఏకంగా రూ.350 కోట్ల‌ను ఆఫ‌ర్ చేసింద‌ట‌. ఇది ఇండియాలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డైరెక్ట్ రిలీజ్ రేటు అనే చెప్పాలి.

ఈ నేప‌థ్యంలోనే అస్స‌లు ఊహించని అద్భుత‌మైన ఆఫ‌ర్ రావ‌డంతో ఓటీటీ రిలీజ్‌కు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపుతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యంపైన‌ ప్ర‌భాస్ సైతం ఆలోచిస్తున్నాడ‌ని టాక్‌. మ‌రి ఒక‌వేళ ఈ ప్ర‌చారం నిజ‌మై ప్ర‌భాస్ పొర‌పాటున‌ ఓటీటీ రిలీజ్‌కి ఓకే చెబితే ఆయ‌న ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఎందుకంటే, రాధేశ్యామ్‌ను థియేట‌ర్స్‌లో చూడాల‌ని అభిమానులు ఎంత‌గానో ఆరాట‌ప‌డుతున్నారు. ఇలాంటి త‌రుణంలో ఓటీటీ రిలీజ్ అని ప్ర‌క‌ట‌న వ‌స్తే వాళ్లు అస్స‌లు స‌హించ‌లేరు.


Share

Related posts

Mega 154: `మెగా 154`లో భాగ‌మ‌వుతున్న చిరు పెద్ద కూతురు..!

kavya N

Anasuya Bharadwaj White Dress Looks

Gallery Desk

ఎవరు చెప్పారు నేను అలాంటిదాన్ని కాదని ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar