మరో భారీ ప్రాజెక్ట్ సైన్ చేసిన ప్రభాస్

Share

బాహుబలి విజయం తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహూ, ఒక్క మేకింగ్ వీడియోతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకి కూడా అంచనాలు పెంచిన ఈ చిత్ర యూనిట్, వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా అయ్యాక ప్రభాస్, కుటుంబ కథా చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్స్ అయిన దిల్ రాజుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు, ప్రభాస్ కాంబినేషన్ లో మంచి సినిమాలే ఉన్నాయి. అయితే సాహూ తర్వాత ప్రభాస్, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చే సినిమాకి ఇప్పుడో క్రేజీ డైరెక్టర్ కలవడంతో సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

తెలుగు మాత్రమే కాకుండా రిలీజ్ అయిన అన్ని చోట్ల హిట్ టాక్ సొంతం చేసుకున్న కెజీఎఫ్ సినిమా టైటిల్ తగ్గట్టు గానే పోస్టర్, టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఎక్సపెక్టషన్స్ పెంచిన కెజీఎఫ్. కేవలం సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం కాకుండా మూవీ మేకింగ్ మాస్టర్స్ కి కూడా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ స్కిల్స్ కి, కథ చెప్పిన విధానానికి సినీ అభిమానుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది, దీంతో ఈ డైరెక్టర్ కి ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి, అందులో ఒకటి ప్రభాస్ సినిమా కావడం.

ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ కు దిల్ రాజు బంపర్ ఆఫర్ ఇచ్చాడని, అది కూడా ప్రభాస్ సినిమాకు అని టాలీవుడ్ లో ఈ వార్త చక్కర్లుకొడుతోంది. అదే నిజమైతే ప్రభాస్ చేయబోయే మరో ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. మరి సాహూ అయ్యాక, ప్రభాస్ టేకప్ చేయబోయే ఈ మూవీ గురించి అప్పుడే ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. అఫీషియల్ ఇంఫార్మేషన్ వచ్చే వరకూ ఈ ప్రాజెక్ట్ ఉంటుందని కచ్చితంగా చెప్పే ఛాన్స్ అయితే లేదు కానీ సినీ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలని కోరుకుంటున్నారు.


Share

Related posts

Movie Release: ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు..!!

Muraliak

బిగ్‌బాస్‌3 ఫైన‌ల్‌కు మెగాస్టార్‌..?

Siva Prasad

Chatrapathi : ఛత్రపతి హిందీ రీమేక్ హైదరాబాద్‌లోనే..!

GRK

Leave a Comment