యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తాజా చిత్రం `సాహో`. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్ట్ 30న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. శ్రద్ధాకపూర్, మందిరాబేడి, చంకీపాండే, నీల్ నితిన్, అరుణ్ విజయ్, జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు హైలైట్‌గా ఉంటాయని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. టీజర్ చూసిన వారికి ఆ సంగతి అర్థమవుతుంది కూడా.
`బాహుబలి` తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా కావడం కూడా సినిమాపై అంచనాలకు మరో కారణంగా నిలిచాయి. సినిమాలో యాక్షన్ సన్నివేశాలను భారీ ఖర్చుతో రూపొందించారు. ఈ సన్నివేశాల్లో నటించడానికి ప్రభాస్ బాగానే కష్టపడ్డారట. బాహబలి సినిమా కోసం బరువు పెరిగిన ప్రభాస్ .. `సాహో` కోసం బరువు తగ్గాడట. బరువు తగ్గే ప్రాసెస్‌లో ఐదు నెలల పాటు వెజిటేరియన్ ఫుడ్‌నే తీసుకున్నానని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
previous post
next post