29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రభాస్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్..!!

Share

Unstoppable 2: ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” టాకీ షో అనేక సంచలనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ తోనే దేశంలో నెంబర్ వన్ టాకీ షోగా “అన్ స్టాపబుల్” నిలిచింది. హోస్ట్ గా బాలకృష్ణ అందరినీ అలరిస్తూ ఉన్నాడు. షో కి వచ్చే ప్రతి సెలబ్రిటీని తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ… కామెడీ పండిస్తున్నాడు. కాగా మొదటి సీజన్ కి కేవలం సినిమా సెలబ్రిటీలు మాత్రమే వచ్చారు. అయితే ప్రస్తుతం సెకండ్ సీజన్ కి సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు కూడా రావటం విశేషం.

Prabhas Unstoppable episode part 2 promo release today at 10 am
Unstoppable 2

మొదటి సీజన్ తో పోలిస్తే సెకండ్ సీజన్ లో చాలా పెద్ద పెద్ద స్టార్స్ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రావటం తెలిసిందే. “అన్ స్టాపబుల్” బాహుబలి ఎపిసోడ్ అంటూ ప్రభాస్ ఎపిసోడ్ నీ స్పెషల్ గా రెండు పార్ట్ లుగా ప్లానింగ్ చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ మొదటి పార్ట్ డిసెంబర్ 29వ తారీకు రాత్రి 9 గంటలకు రిలీజ్ చేయడం తెలిసిందే. ఇక రెండో పార్ట్ జనవరి ఆరో తారీకు విడుదల కానుంది.

Prabhas Unstoppable episode part 2 promo release today at 10 am
Unstoppable 2

అయితే ఈ రెండో పార్ట్ కి సంబంధించి ప్రోమో ఈరోజు ఉదయం 10 గంటలకు ఆహా టీం రిలీజ్ చేయటానికి రెడీ అయింది. మొదటి పార్ట్ లో చివరిలో గోపీచంద్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఆగిపోయింది. దీంతో సెకండ్ పార్ట్ లో గోపీచంద్ తో కలిసి ప్రభాస్ సందడి చేసిన షో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. “అన్ స్టాపబుల్” ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ వన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. 100 మిలియన్ ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు ఆహా తెలియజేయడం జరిగింది. మరి సెకండ్ పార్ట్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Share

Related posts

ఇస్మార్ట్ బ్యూటీకి పవర్ స్టార్ సినిమాతో పాటు తమిళంలో వరసగా అవకాశాలు ..!

GRK

Prabhas: వ‌రుస ఫ్లాపులొచ్చినా త‌గ్గేదే లే.. ప్ర‌భాస్ క్రేజ్‌కు ఇదో నిద‌ర్శ‌నం!

kavya N

Darshana Banik Latest Photos

Gallery Desk