RRR: “RRR” సినిమాలో “నాటు నాటు” సాంగ్ కీ ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో అవార్డు గెలవడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి… పాట రాసిన చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. దీంతో “RRR” సినిమా యూనిట్ పై ప్రధాని మోడీతో సహా చాలా మంది రాజకీయ నేతలు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా డాన్స్ మాస్టర్ ప్రభుదేవా స్పందించడం జరిగింది. “నాటు నాటు” టీంనీ వినూత్నంగా అభినందిస్తూ అదే స్టైల్ లో డాన్స్ వేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి.. వందలాది మంది తన టీంతో “నాటు నాటు” సాంగ్ కి సంబంధించిన స్టెప్పులు వేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ప్రభుదేవా నాటు నాటు సాంగ్ కీ వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.
మార్చి 13వ తారీకు ఆస్కార్ అవార్డు అందుకున్న “RRR” టీం మెల్ల మెల్లగా అమెరికా నుండి వస్తున్నారు. అవార్డు వచ్చినా అనంతరం తారక్ అమెరికా నుండి మొదట వచ్చేశారు. అభిమానులు భారీ ఎత్తున శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. తర్వాత రాజమౌళి ఎంఎం కీరవాణి మిగతా కుటుంబ సభ్యులు శుక్రవారం రావడం జరిగింది. ఇక శనివారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హైదరాబాద్ చేరుకున్నరు.
ఈ క్రమంలో హైదరాబాద్ విమానాశ్రయంలో చరణ్ కీ ర్యాలీ రూపంలో మెగా ఫ్యాన్స్ భారీ ఎత్తున స్వాగతం పలికారు. అంతకుముందు ఢిల్లీలో చరణ్ ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సత్కరించారు. ఇక ఇదే సమయంలో ఆస్కార్ అవార్డు రావడంతో “RRR” సినిమా యూనిట్ ని తెలంగాణ ప్రభుత్వం సత్కరించాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా “నాటు నాటు” సాంగ్ ట్రేండింగ్ గా మారిందీ.