NewsOrbit
సినిమా

విడిపోతున్న రాఘ‌వేంద్ర‌రావు కొడుకు-కోడ‌లు!

Share

రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి, కోడ‌లు క‌నికా ధిల్లాన్ విడిపోతున్నారా? ఆల్రెడీ విడిపోయారు కానీ, ఇంకా బ‌య‌ట‌కు తెలియ‌లేదు అనేది స‌న్నిహితుల మాట‌. బాలీవుడ్‌లో దియామీర్జా, సాహిల్ సంఘా విడిపోయిన వార్త వేడి చ‌ల్లార‌క‌మునుపే ఈ జంట విడిపోతున్నార‌నే మాట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అందుకు కార‌ణం సాహిల్ సంఘాకు, క‌నికాకు మ‌ధ్య ఉన్న సంబంధ‌మేన‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే వీటి గురించి వారిద్ద‌రూ ఇంకా బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. కానీ వాళ్లు ప‌నిచేసిన సినిమా.. అంటే ద‌ర్శ‌కుడుగా ప్ర‌కాష్‌, స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా క‌నికా ప‌నిచేసిన సినిమా `జ‌డ్జిమెంట‌ల్ హై క్యా` స‌మ‌యంలోనే వీరిద్ద‌రికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేది అని షూటింగ్ స్పాట్‌లో ఉన్న వారి మాట‌. వీరిద్ద‌రు ఇక‌పై క‌లిసి ప‌నిచేసే అవ‌కాశ‌మే లేద‌ని కూడా అంటున్నారు. అస‌లు సాహిల్‌తో క‌నిక‌కు ఉన్న బంధం ఏంట‌ని అడిగితే ఆమె మండిప‌డ్డారు. నిద్ర‌లేస్తే ఏదో ఒక‌టి రాసుకుంటూ ఉండేవారి ఊహ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అలాంటి చెత్త వాటి గురించి ఆలోచించే తీరిక లేద‌న్నారు. త‌న జీవితం మొత్తం మీద సాహిల్‌నిగానీ, దియానీకానీ ఇప్ప‌టిదాకా క‌ల‌వ‌లేద‌ని అన్నారు. అయితే ప్ర‌కాష్‌తో విడిపోవ‌డం గురించి మాత్రం ఆమె ఎక్క‌డా నోరు విప్ప‌లేదు. గ‌త కొన్నేళ్లుగానే వారిద్ద‌రి మ‌ధ్య సంబంధాలు స‌రిగ్గా లేవ‌ని, జ‌డ్జిమెంట‌ల్ హై క్యా స‌మ‌యంలో వారిద్ద‌రికీ అస‌లు పొత్తు కుద‌ర‌లేద‌నీ, త్వ‌ర‌లోనే విడాకులవార్త బ‌య‌ట‌కు తెలుస్తుంద‌ని వినికిడి. కొడుకు ప్రేమ కాద‌న‌లేక ఉత్త‌రాది అమ్మాయిని కోడ‌లుగా చేసుకున్న రాఘ‌వేంద్ర‌రావు, ఈ వార్త‌ను ఎలా తీసుకుంటారో చూడాలి.


Share

Related posts

చై-సామ్ విడాకులు.. మా పనిమనిషి చెబితేనే తెలిసింది: మురళీ మోహన్

kavya N

Ram Charan: ఆ సినిమా ఫ్లాప్‌కు చరణ్ కారణమా..రెమ్యునరేషన్ ఎందుకు తిరిగిచ్చేసినట్టు..!

GRK

జెనీలియా వ‌చ్చేస్తుందోచ్‌!

Siva Prasad

Leave a Comment