NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

Prakash Raj: నేను నాన్ లోకలా..? ఇన్నాళ్లూ గుర్తు రాలేదా..? ప్రకాశ్ రాజ్ ప్రశ్నలు

prakash raj about maa elections

Prakash Raj: ప్రకాశ్ రాజ్.. Prakash Raj మా ఎన్నికల్లో పోటీ చేస్తూండటంతో టాలీవుడ్ హీటెక్కిపోతోంది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలంటే ఇరువర్గాల మాటల యుద్ధమే జరిగేది ఎప్పుడూ. ఈసారి కొత్తగా ‘నాన్ లోకల్’ ఇష్యూ వచ్చేసింది. ఇందుకు ‘ప్రకాశ్ రాజ్’ పోటీ చేయడమే కారణం. కన్నడిగుడైన ప్రకాశ్ రాజ్ తెలుగు చిత్ర పరిశ్రమకు చేయడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదన్నారు. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు కొత్తగా నాన్ లోకల్ అంటుంటే విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్యానల్ ని ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

prakash raj about maa elections
prakash raj about maa elections

‘కళాకారులు వెలుగులాంటి వాళ్లు. భాషతో సంబంధం ఉండదు. గతంలో లేని నాన్‌లోకల్‌ ఇప్పుడెందుకు వస్తుంది? ఇదేం అజెండా..? నా అసిస్టెంట్స్‌కి ఇక్కడే ఇళ్లు కొనిచ్చినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. రెండు గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు. తొమ్మిది నందులు తీసుకున్నప్పుడు, జాతీయ అవార్డు పొందినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. మరి.. ఇప్పుడు నాన్‌లోకల్‌ అని ఎలా అంటున్నారు..? ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం ఉన్నవాళ్లు చేసే వ్యాఖ్యలివి. ‘మా’లో పోటీ చేయాలని రెండేళ్ల నుంచీ అనుకుంటున్నాను. ఏడాది కాలంగా ప్యానెల్‌లోకి ఎవర్నీ తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నాను. పరిశ్రమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను. ప్రతిదానికి లెక్కలు చూపిస్తాం. అందరూ ఆశ్చర్యపడేలా పనిచేస్తాం.

Read More: VV Vinayak: మెగా కాంపౌండ్ లో వినాయక్..! చిరంజీవి కోసం కథ..!?

మాది సినిమా బిడ్డల ప్యానల్‌. పదవీ కోసం పోటీ కాదు.. పనిచేయడానికే పోటీ చేస్తున్నాం. కోపంతో పుట్టిన ప్యానల్‌ కాదు. ఆవేదనతో పుట్టింది. నా ప్యానల్‌ సభ్యులందరూ ప్రశ్నించేవాళ్లే. తప్పు చేస్తే నన్ను కూడా ప్రశ్నించే అర్హత వాళ్లకు ఉంది. ప్యానల్‌లో సభ్యులందరూ కష్టాలు పడ్డవాళ్లే. ఇండస్ట్రీలో అనుభవం ఉన్నవాళ్లే. చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు.. అందరిదీ అసోసియేషన్‌ని అభివృద్ధి చేయాలనే తపనే. ‘మా’ బలమైన అసోసియేషన్‌. నేను అడిగానని కాదు.. అర్హత చూసి ఓటేయండి. ప్రతిరోజూ పెద్దలందరితో మాట్లాడుతున్నాం. ఎలక్షన్‌ డేట్‌ ప్రకటించే వరకూ మా ప్యానల్‌ సభ్యులెవరూ మీడియా ముందుకు రారు. ఇందులో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారనే వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. సెప్టెంబర్‌లో జరుగనున్న ‘మా’ ఎన్నికల అంశం చర్చనీయంశం అయ్యియి.

 

author avatar
Muraliak

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri