ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మధ్యలోకి ప్రభాస్..! కారణమిదేనా..?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ మూవీ అనౌన్స్ కావడం ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయిందనే వార్తే చర్చనీయాంశం అవుతోంది. అయితే.. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 తర్వాత చేస్తాడనుకున్న సినిమా ఎన్టీఆర్ తో. వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయని కూడా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్.. ‘అణు రియాక్టర్ ముందు కూర్చున్నట్టుంది’ అని ట్వీట్ కూడా చేశాడు. ఎన్టీఆర్ తో సినిమా అనే వార్తతో ప్రశాంత్ నీల్ పై కన్నడ ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ప్లేస్ లోకి ప్రభాస్ రావడం.. టైటిల్, పోస్టర్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

prashant neel with prabhas instead of ntr
prashant neel with prabhas instead of ntr

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా అనే వార్తపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా కన్ఫర్మ్ అయ్యాడు. కానీ.. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ప్రశాంత్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచ్చలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్ లో ప్రభాస్ కు కథ చెప్పి ఒప్పించుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే.. సలార్ లో ప్రభాస్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. అండర్ వరల్డ్ డాన్ గా ప్రభాస్ నటిస్తున్నాడని అంటున్నారు. ప్రభాస్ లుక్, చేతిలో మిషన్ గన్ తో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

‘సలార్’ అనే టైటిల్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కేజీఎఫ్ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే 2014లో సూపర్ హిట్ అయిన కన్నడ మూవీ ‘ఉగ్రం’ రీమేక్ అనే వార్తలు వచ్చాయి. కానీ.. పోస్టర్, పాన్ ఇండియా మూవీ అని మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఆ గాసిప్స్ లో నిజమెంతో సినిమా టీమ్ రివీల్ చేయాల్సి ఉంది. మరి.. ఎన్టీఆర్ తో చేయలనుకున్న కథ ఇదేనా.. లేక వేరే కథతో ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడా అనే క్లారిటీ ప్రశాంత్ ఇవ్వాల్సిందే.