న్యూస్ సినిమా

Prashanth Neel: టాలీవుడ్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..నెట్టింట వైరల్..

Share

Prashanth Neel: టాలీవుడ్ హీరోలపై కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉగ్రమ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత కేజీఎఫ్ ఛాప్టర్ 1 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 2తో ఇప్పుడు సెన్షేషనల్ డైరెక్టర్‌గా మారాడు. అయితే, ఇప్పటికే ప్రశాంత్ నీల్‌ను కన్నడ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం ఆయన తెలుగు హీరోలతో సినిమాలు చేస్తుండటమే.

prashanth-neel-intresting comments on tollywood heores
prashanth-neel-intresting comments on tollywood heores

కేజీఎఫ్ చిత్రాలను చూసిన టాలీవుడ్ స్టార్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎన్.టి.ఆర్ లాంటి వారి ప్రత్యేకంగా ఇంటికి పిలిపించి అభినందించారని ఇటీవల ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తోంది. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ లేదా మహేశ్ బాబుతో ఓ సినిమా చేయవచ్చనే సమాచారం అందుతోంది. మైత్రీ వారు ఇప్పటికే ప్రశాంత్ నీల్ – ఎన్.టి.ఆర్ కాంబో గురించి కూడా వెల్లడించారు.

Prashanth neel: కథ అనుకున్న తర్వాతే హీరోను ఫిక్స్ అవుతా..

అయితే, కన్నడతో కంటే తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దదని.. ఇక్కడ సినిమా చేస్తే .. డబ్బు దానికి రెట్టింపు పేరు వస్తుందని భావిస్తుంటారు. ఈ కారణంగానే ప్రశాంత్ నీల్ కన్నడ హీరోలను కాదని తెలుగు హీరోలకు క్లోజ్‌గా ఉంటున్నాడని..వారికే కథలు చెబుతున్నాడ ని టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు. ‘కన్నడ ఇండస్ట్రీ అంటే నాకు ఎంతో గౌరవం అని.. ఆ ఇండస్ట్రీలో నేనూ ఒకడిని అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, నా సినిమా చూడగానే ముందు ఎన్టీఆర్ .. మహేశ్ బాబు కాల్ చేశారు. ప్రత్యేకంగా నన్ను అభినందించారు. అంతే తప్ప తమతో సినిమా చేయమని అవకాశం ఇవ్వలేదని…ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇక కథ అనుకున్న తర్వాతే హీరోను ఫిక్స్ అవుతానని తెలిపాడు.


Share

Related posts

Mangli : మంగ్లీ మహాశివరాత్రి పాట ప్రోమో అదుర్స్

Varun G

MAA: మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ కీలక లేఖ..! ముదురుతున్న వివాదం..!!

somaraju sharma

అక్కడ ఎలాంటి నమ్మకం పెట్టుకోవద్దు అంటూ మెగా మేనల్లుడికి ముందే హెచ్చరిస్తున్నారా ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar