KGF 3: “కేజిఎఫ్” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన “కేజిఎఫ్ 2” కూడా మొదటి భాగం కంటే అంతకుమించి అన్న తరహాలో అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇంకా థియేటర్లలో “కేజిఎఫ్ 2″ రన్ అవుతుంది. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించిన ఈ సినిమా చివరిలో మూడో చాప్టర్ ఉన్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హింట్ ఇవ్వటంతో…”కేజిఎఫ్ 3” కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
“కేజిఎఫ్” మొదటి భాగం, రెండో భాగంలో హీరో యాష్ నీ చాలా పవర్ ఫుల్ గా చూపించడంతో మూడో చాప్టర్ లో యాష్ నీ ఏ రీతిగా చూపిస్తాడు అన్నది సస్పెన్స్ గా ఉంది. అయితే ఈ తరుణంలో యాష్ అభిమానులకు దిమ్మతిరిగే షాక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళితే “కేజిఎఫ్ 3” పవర్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టు కన్నడ సినీ వర్గాలలో లేటెస్ట్ టాక్ వైరల్ అవుతుంది. “కేజిఎఫ్” కి పుట్టిన మొదటి కూతురు.. నేపథ్యంలో ఆ కాన్సెప్ట్ లైన్ తో స్టోరీని ప్రశాంత్ నీల్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఫిమేల్ లేడీ క్యారెక్టర్ లో ఒక ప్రముఖ హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ప్రశాంత్ నీల్…ఉన్నారట. ఆరీతిగా “కేజిఎఫ్ 3” లేడీ క్యారెక్టర్ నీ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ “సలార్” సినిమా పై ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా కంప్లీట్ చేయనున్నారట. దీని తర్వాత “కేజిఎఫ్ 3” పై ప్రశాంత్ నీల్ ఫోకస్ పెట్టనున్నట్లు కన్నడ సినీ వర్గాలలో వార్తలు వస్తున్నాయి.