సినిమా

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వార్త.. వచ్చేసింది..??

Share

NTR: “RRR” బ్లాక్ బస్టర్ హిట్ తో ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకోవడం తెలిసిందే. కొమరం భీం పాత్రలో తారక్ “RRR” విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించారు. “కొమరం భీముడో”..సాంగ్ లో..అయితే తారక్ హావభావాలకు అందరూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఇదంతా పక్కన పెడితే రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు పరాజయం పాలు కావడం తెలిసిందే. ఈ తరుణంలో ప్రస్తుతం “RRR” తరువాత ఎన్టీఆర్…కొరటాల శివ దర్శకత్వంలో తన కెరియర్ లో 30వ సినిమా చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.

PRASHANTH NEEL NTR MOVIE GOING TO SETS ON THIS DUSSARA

అయితే “ఆచార్య” రిలీజ్ అవ్వకముందు కొరటాల కి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అయితే ఇటీవల “ఆచార్య” అట్టర్ ఫ్లాప్ కావడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల ఏం చేస్తాడో.. అనే టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్… ఎన్టీఆర్ తో సినిమా ఓకే చేయటం తెలిసిందే. “కేజిఎఫ్” ఒక మంచి మాస్ కంటెంట్ కలిగిన సినిమా.. కావటంతో పాటు హీరో యాష్ నీ ప్రశాంత్ నీల్… మంచి మాస్ హీరోగా స్క్రీన్ పై ప్రజంట్ చేశాడు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని మాస్ క్రేజ్ ఉన్న తారక్ నీ ఎలా చూపిస్తాడో.. అనే డిస్కషన్స్ అభిమానులలో జరుగుతున్నాయి. ఇక ఇదే సమయంలో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది మొన్నటివరకు సస్పెన్స్ గా ఉంది.

పరిస్థితి ఇలా ఉంటే ఈ ప్రాజెక్ట్ ఈ దసరా నుండి స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కొరటాల శివ సినిమా షూటింగ్ ఏకధాటిగా చేస్తున్నే మరోపక్క ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెట్టడానికి తారక్ రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. రాజమౌళి సినిమా తరువాత ఒకవేళ కొరటాల సినిమా మిస్ ఫైర్ అయినా “కేజిఎఫ్” డైరెక్టర్ సినిమా క్లిక్ అవడం గ్యారెంటీ అన్న ఆలోచనతో ఎన్టీఆర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది దసరా కి ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు ఇండస్ట్రీలో టాక్  బలంగా వినపడుతోంది.


Share

Related posts

దీపిక కోసం వెయిట్‌ చేయలేడట… 

Siva Prasad

Pawan kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే ఆ సినిమాలు కమిటవుతున్నారా..?

GRK

Adivi Sesh: పెళ్లిపై ప్ర‌శ్న‌లు.. ప్ర‌భాస్‌, అనుష్కల‌తో ముడిపెట్టిన అడివి శేష్!

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar