NTR: “కేజీఎఫ్” తో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో హీరో యాష్ ని వెండితెర మీద చూపించిన విధానం .. చూసి చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్న మాస్ పల్స్ కలిగిన హీరోలు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఎగబడ్డారు. అటువంటి మాస్ పల్సర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలిగిన హీరోల లో ముందు వరుసలో ఉండే హీరో ఎన్టీఆర్. నందమూరి ఫ్యామిలీ లో అభిమానులను కాలర్ ఎగరేసే రీతిలో ప్రజెంట్ జనరేషన్ ఆలోచనలకు తగ్గ రీతిలో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర తిరగ రాస్తూ ఉన్నాడు.
అటువంటి ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఓకే చేయటం టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీ లో ఈ ప్రాజెక్టు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ డాన్స్ ఫైట్స్ ఫిజిక్ ఏ విధంగా చూసినా ఫర్ఫెక్ట్ ఆల్ రౌండర్ కంటెంట్ కలిగిన హీరో అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఎన్టీఆర్ వాయిస్ చాలా గంభీరం తోపాటు అచ్చుగుద్దినట్టు మాస్ పల్స్ ప్రేక్షకులను అలరించే రీతిలో ఉండటంతో ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా రాజకీయ నేపథ్యంలో తీయాలని ప్రశాంత్ నీల్ ఫుల్ గా డిసైడ్ అయ్యారట.
స్క్రిప్ట్ ఓకే చేయకముందు ఎన్టీఆర్ వాయిస్ డైలాగ్ డెలివరీ అంతా బేరీజు వేసుకొని ప్రస్తుతం యంగ్ పొలిటీషియన్ స్టొరీ బేస్ చేసుకొని మాస్ కథాంశంతో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటిలో ఎన్టీఆర్ ని డాన్ పాత్రలో చూపిస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ తాజాగా మాత్రం రాజకీయ నాయకుడు .. తరహాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని టాక్.