ఒకప్పుడు హీరోగా సరైన హిట్ కోసం చాలా కాలం వెయిట్ చేస్తూ వచ్చిన రాజశేఖర్‌కి డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు `గరుడవేగ`తో బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే.. సీక్వెల్ కూడా చేయాలనుకున్నారు. `గరుడవేగ` పెద్ద హిట్ అయ్యింది. మరి సీక్వెల్ తీయ్యొచ్చుగా అంటే.. కొన్ని కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సీక్వెల్‌కు తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే ఈ సీక్వెల్‌ను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తాడా? అనేది సందేహంగా మారింది. ఎందుకంటే ప్రవీణ్ సత్తారు, తన కమిట్మెంట్స్తో బిజీగా ఉంటున్నాడు.. రాజశేఖర్‌కి మాత్రం ప్రవీణ్‌తో సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉన్నా కూడా.. ప్రవీణ్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న `కల్కి` హిట్ అయితే చూద్దాం లే! అనే భావనలో ఉన్నాడని సమాచారం.
previous post
next post