Sitara: అవును.. కొడుకుకంటే కూతురినే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు మన ప్రిన్స్ మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి తెలియని వారు వుండరు. ఆమె కెమెరాతో పుట్టింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సితార తన చిన్ననాటినుండీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. సితారకు తన తండ్రి మహేష్ బాబు సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ ఇంస్టాగ్రామ్ వీడియోలు పోస్ట్ చేయడం పరిపాటి. తాజాగా అలాగే చేసింది.
Sitara: సితార ప్రమోషన్ అందుకేనా?
తాజాగా స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ లో ఛానల్ ని ప్రత్యేకంగా ప్రారంభించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది సితార. అప్పుడప్పుడు మహేష్ పాటలకు రీల్స్ చేస్తూ స్టెప్పులను ఇరగదీస్తోంది. సితార సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ చేసినా కూడా కొద్ది క్షణాల్లోనే లక్షల్లో లైక్స్ వ్యూస్ రావడం విశేషం. ఈ క్రమంలో కనీసం టీనేజ్ లోకి రాకముందే ఇటివంటి చర్య పట్ల కొంతమంది పలురకాల ఊహాగానాలు చేస్తున్నారు. మహేష్ బాబు కొడుకు కంటే ముందుగా సితారను తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం చేయనున్నాడని వినికిడి.
నెటిజన్స్ వ్యూ:
ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సితార ని సోషల్ మీడియా వేదికగా గౌతమ్ ని మించి ప్రమోట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకింత అగ్రెసీవ్ గా సితారని ప్రమోట్ చేస్తున్నారు? గౌతమ్ ని ఎందుకు పట్టించుకోవడం లేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా సితార ను మహేష్ బాబు హీరోయిన్ గా పరిచయం చేయాలన్న ఆలోచనలో భాగంగనే ఇలా ప్రమోట్ చేస్తున్నారా? అన్న అనుమానాలు ఇపుడు సోషల్ మీడియాలో రావడం కొసమెరుపు.