సినిమా

Samantha: సమంత పోస్ట్ కు ‘ఐ టూ లవ్ యూ’ అంటూ ప్రీతమ్ కామెంట్

Share

Samantha:సమంత‍, నాగ చైతన్యలు తామిద్దరం విడాకులు తీసుకున్నామని అధికారికంగా ప్రకటించేశారు. భార్యాభర్తలుగా విడిపోతోన్నామని, తమ మధ్య ఉన్న ఆ స్నేహబంధం మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే చైసామ్ విడాకుల మ్యాటర్‌పై ఎన్నో రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. అందులోంచి ఓ దారుణమైన రూమర్ సమంత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ గురించి వచ్చింది. అయితే ప్రీతమ్ మాత్రం తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Pritam commented on Samantha's post saying 'I love you'
Pritam commented on Samantha’s post saying ‘I love you’

Samantha: వైరల్ గా మారిన సమంత పోస్ట్..

అయితే.. విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అవి సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ఆమె స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ కి ఐ లవ్ యూ… చెప్పారు. దానికి ప్రతిస్పందనగా ప్రీతమ్ కూడా ఐ టూ లవ్ యూ చెప్పారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన కాతువాక్కుల రెండు కాదల్ మూవీలో విజయ్ సేతుపతి లవర్స్ గా నయనతార, సమంత నటించారు. గత వారం విడుదలైన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సమంత ఖతీజా అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు.

Pritam commented on Samantha's post saying 'I love you'
Pritam commented on Samantha’s post saying ‘I love you’

లవ్ యూ టూ అంటూ ప్రీతమ్ రిప్లై..

ఈ సినిమా గురించి సమంత ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ఖతీజా పాత్రలో అద్భుతంగా నటించే ఛాన్స్ ఇచ్చినందుకు విఘ్నేష్ శివన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు కామెడీ జోనర్ అంటే చాలా ఇష్టమని, కథువాకుల రెండు కాదల్ మూవీతో ఆ కోరిక తీరినట్లు వెల్లడించారు. ఆ తర్వాత సమంత ప్రీతమ్ జుకల్కర్ తో పాటు మరి కొందరిని ట్యాగ్ చేస్తూ లవ్ సింబల్స్ పెట్టారు.సమంత ట్యాగ్ చేయడంతో ప్రీతమ్ జుకల్కర్ లవ్ యూ టూ జీజీ అని రిప్లై ఇచ్చారు.అయితే ప్రీతమ్ చేసిన కామెంట్ కు నెటిజన్లు తమదైన శైలిలో రియాక్షన్ ఇచ్చారు.


Share

Related posts

Rashi Khanna Green saree Photos

Gallery Desk

‘సలార్’ టైటిల్.. హీరోగా ప్రభాస్.. వివరాలు చెప్పిన ప్రశాంత్ నీల్

Muraliak

RC15: దిల్ రాజు ఇచ్చిన సాలీడ్ అప్‌డేట్‌తో ఇక ఆర్ఆర్ఆర్ మూవీ గురించి పట్టించుకోరేమో..

GRK