Chiranjeevi Pruthviraj: పృథ్వీరాజ్ సుకుమారన్ తన కొత్త సినిమా “కడువా” ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ కి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. “కడువా” సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు. ఇదే సందర్భంలో ఓ విలేకరి.. మీరు దర్శకుడు కూడా కదా, తెలుగులో ఛాన్స్ వస్తే ఎవరితో చేస్తారు అని ప్రశ్నించారు. దానికి పృథ్వి రాజ్ సమాధానమిస్తూ స్క్రిప్ట్ బట్టి సెలెక్ట్ చేసుకుంటాను. ముందుగానే హీరోని డిసైడ్ చేయను. అయితే తెలుగులో “లూసిఫర్” రీమేక్ చిరంజీవి “గాడ్ ఫాదర్” చేయడం చాలా సంతోషం. కచ్చితంగా ఆ క్యారెక్టర్ ఆయనకే సూటబుల్ అవుద్ది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ విషయం తెలుసుకొని నేను చాలా సంతోషించాను. అయితే గతంలో రెండు సంవత్సరాల క్రితం చిరంజీవి గారితో సినిమా నటించే అవకాశం వచ్చింది. “సైరా” లో ఓ క్యారెక్టర్ చేయాలని కోరారు. కానీ మలయాళంలో భారీ బడ్జెట్ సినిమాకి సంబంధించి విదేశాలలో షూటింగ్ జరుగుతుంది. నా సినిమా డేట్స్ మొత్తం దానికి ఇవ్వటంతో అవకాశం కోల్పోయాను. అయితే కొద్ది రోజుల తర్వాత మళ్లీ “గాడ్ ఫాదర్” సినిమా దర్శకత్వం చేసే ఛాన్స్ నిర్మాతల నుండి వచ్చింది. కానీ అప్పటికి కూడా నేను ఇంకా ఆ పెద్ద సినిమా షూటింగ్ లోనే ఉన్నాను.
డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక పోయాను. దీంతో చిరంజీవి ని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న. దాదాపూర్ రెండు సంవత్సరాలలో చిరంజీవిగారితో సినిమా అవకాశాలొచ్చాయి రెండు కూడా మిస్ అయ్యాయి… అంటూ పృథ్వీరాజ్ కడువా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కొత్త విషయాన్ని తెలియజేశారు. ఇక తెలుగులో కూడా స్ట్రెయిట్ సినిమాలు చేయాలనే పాలు నిర్మాతలు మరియు దర్శకులు వస్తున్నారు. అంతా కుదిరితే త్వరలోనే తెలుగులో కూడా సినిమా చేస్తానని పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.