మలయాళ చిత్రం ‘ఒరు ఆడార్ లవ్’లో ఇద్దరు హీరోయిన్స్ సెకండ్ హీరోయిన్గా నటించింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఆసినిమాలోని ఓ సీన్లో చిన్నగా కన్నుగీటే సన్నివేశంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రాత్రికి రాత్రే సెన్సేషనల్ స్టార్ అయ్యింది. తొలి సినిమా విడుదల కాకముందే ప్రియా ప్రకాశ్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ‘ఒరు ఆడార్ లవ్(తెలుగులో లవర్స్ డే)’ ప్లాప్ కావడంతో అంతే వేగంతో అవకాశాలు వెనక్కి వెళ్లాయి. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘శ్రీదేవి బంగ్లా’ విడుదలకు సిద్ధమవుతుంది.
టాలీవుడ్లో కూడా ప్రియా ప్రకాశ్‌కు అవకాశాలు వచ్చాయి. బన్నితో కూడా నటించే అవకాశాన్ని అప్పట్లో అమ్మడు వద్దని అనుకుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు మరో టాలీవుడ్ అవకాశం దక్కిందట. నితిన్ ఇప్పుడు మూడు సినిమాలను చేయడానికి రెడీ అయ్యాడు. అందులో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మించబోయే ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్‌ను హీరోయిన్గా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
previous post
next post