ఏ ముహూర్తాన ఒరు ఆడార్ లవ్ సినిమాను స్టార్ట్ చేశారో తెలియడం లేదు కానీ.. ఆ సినిమా విడుదలకు ముందు తెచ్చుకున్న క్రేజ్‌కు.. విడుదల తర్వాత ఉన్న విమర్శలకు ముగింపు రావడం లేదు. సినిమా విడుదలై ప్లాపైంది. అంతటితో వివాదాలు మాత్రం ఆగడం లేదు. ప్రియా వారియర్‌కు కన్నుగీటడంత క్రేజ్ వచ్చేసింది. దాని వల్ల కథను మార్చాలి వచ్చిందని.. ఆ కారణంగా ట్రాక్ పాడైపోయి సినిమా ప్లాప్ అయ్యిందని, ప్రియా వారియర్ నిర్మాతలను ఇన్ఫ్లూయెన్స్ చేసిందని దర్శకుడు ఒమర్ లులు రీసెంట్గా అమెపై విమర్శలు చేశాడు. ఆమెతో భవిష్యత్‌లో కలిసి పనిచేయనని కూడా చెప్పుకున్నాడు. ఇక ప్రియా వారియర్ సహ నటి నూరీన్ షరీష్ కూడా ప్రియా వారియర్ కారణంగానే తన పాత్ర దెబ్బతిందని చెప్పుకుంది. అయితే ఈ విషయాలపై పెద్దగా నోరు విప్పని ప్రియా వారియర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా బదులిచ్చింది. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని.. నేను నోరు విప్పితే రచ్చ రచ్చే అంటూ పోస్ట్ చేసింది. మరి దీనిపై దర్శకుడు స్పందిస్తాడో లేదో చూడాలి..
previous post
next post