వివాద‌స్ప‌ద పాత్ర‌లో ప్రియ‌మ‌ణి

త‌మిళ న‌టి ప్రియ‌మ‌ణి ఓ వివాద‌స్పద‌మైన పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కు ఆమె పోషించ‌బోతున్న పాత్ర ఎవ‌రిదో తెలుసా? త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి స్నేహితురాలు శ‌శిక‌ళ రోల్‌. జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్ `త‌లైవి` అనే పేరుతో సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ జ‌య‌ల‌లిత పాత్ర‌లో న‌టిస్తుంటే.. ఆమె స్నేహితురాలిగా శ‌శిక‌ళ న‌టిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ చెన్నైలో శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. రీసెంట్‌గా ఈ సినిమాలో జ‌యల‌లిత‌గా కంగ‌నా లుక్‌ను చిత్ర బృందం విడుద‌ల చేస్తుంది. వ‌చ్చే ఏడాది జూన్ 26న సినిమా విడుద‌ల కానుంది.