Priyamani: ప్రియమణి.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఎవరే అతగాడు?` సినిమాతో కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ కేరళ కుట్టి.. తనదైన టాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. టాలీవుడ్లో ఎన్టీఆర్, బాలకృష్ణ, జగపతిబాబు, నాగార్జున, వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలందరి సరసనా ఆడిపాడి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రియమణి.. సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. అలాగే ఈ బ్యూటీ రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఇంతకు ముందు రోజుకు లక్షన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకున్న ప్రియమణి.. ఇప్పుడు రూ. 4 లక్షల వరకు ఛార్జ్ చేస్తోందట. ప్రియమణికి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సైతం ఆమె ఆడిగినంత ఇచ్చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో తెలియాల్సింది.
కాగా, ప్రియమణి ఇటీవల `భామా కలాపం` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమన్యు దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రియమణి తన నటనతో మెస్మరైజ్ చేసిందని చెప్పొచ్చు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!