బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. ఈ మధ్య హిందీలో నటించడమే లేదు. సల్మాన్‌తో `భరత్`లో నటించాల్సింది కానీ.. పెళ్లి కారణంగా వద్దనుకుంది. అయితే ఇప్పుడు ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో ప్రియాంక చోప్రా.. చేస్తున్న రోల్ షాకింగ్‌గా ఉంది. వివరాల్లోకెళ్తే.. కామాటిపుర ప్రాంతానికి చెందిన వేశ్యా గృహ నిర్వాహకురాలు గంగుబాయిగా కనిపించబోతున్నారట. మేడమ్ ఆఫ్ కామాటిపురగా పిలవబడ్డ గంగుబాయి కథను ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాకు హీరా మండి అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు. వేశ్య గృహ నిర్వాహకురాలు తర్వాత నెమ్మదిగా రౌడీ రాణిగా ఎలా ఎదిగిందనేదే సినిమాలో చూపించబోతున్నారట. ఈ సినిమాతో పాటు సంజయ్ లీలా భన్సాలి సల్మాన్ ఖాన్‌తో ఇన్షా అల్లాను కూడా తెరకెక్కిస్తున్నారు.
previous post
next post