NewsOrbit
Entertainment News సినిమా

SSMB28: “SSMB28” కీ సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చిన నిర్మాత నాగ వంశీ..!!

Share

SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ అప్ డేట్.. మార్చి 26వ తారీకు ఆదివారం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే ఏడాది జనవరి 13వ తారీకు “SSMB28” సినిమా విడుదల చేస్తున్నట్లు కొత్త తేది ప్రకటించారు. అయితే తాజాగా ఇప్పుడు సినీ నిర్మాత నాగ వంశీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31వ తారీకు పెద్ద అప్ డేట్ రివిల్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఖచ్చితంగా వచ్చే అప్ డేట్ టైటిల్ అని అభిమానులు భావిస్తున్నారు.

Producer Naga Vamsi gave another update regarding SSMB28 key

మహేష్ బాబుకి తండ్రి కృష్ణ పుట్టినరోజు సెంటిమెంట్. అయితే గత ఏడాది కృష్ణ మరణించడంతో ఇప్పుడు పుట్టినరోజు.. వస్తూ ఉండటంతో మహేష్ సినిమా నుండి ఎటువంటి అప్ డేట్ వస్తుందో అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడోసారి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయితే.. అక్టోబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది.

Producer Naga Vamsi gave another update regarding SSMB28 key

మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్.. ప్రారంభించే క్రమంలో.. కృష్ణ మరణించడం జరిగింది. ఆ తర్వాత జనవరి నెలలో సంక్రాంతి పండుగ తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. అప్పటినుండి ఏకధాటిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అంతకముందు మహేష్..త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. థియేటర్లో పెద్దగా ఆడకపోయినా గానీ టీవీలో మాత్రం ఇప్పటికీ కూడా.. రికార్డు స్థాయి టిఆర్పి రేటింగ్స్ నమోదవుతాయి. దీంతో వీరిద్దరి కలయికలో వస్తున్న “SSMB28″పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

Brahmanandam: మీమ్స్‌పై క్రేజీగా ఫీల్ అవుతున్న బ్రహ్మానందం.. షాక్ లో ఆలీ?

Ram

Nayan-Vignesh: వైభ‌వంగా జ‌రిగిన న‌య‌న్‌-విఘ్నేశ్‌ల‌ వివాహం.. నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

kavya N

సుమ కాపురంలో చిచ్చు పెట్టిన బిగ్ బాస్ విన్నర్..! షో మధ్యలోనే రాజీవ్ కనకాల పై కోపం…

arun kanna