NewsOrbit
Entertainment News సినిమా

Bholaa Shankar: ఆస్తుల అమ్మకం డేంజర్ జోన్ లో “భోళా శంకర్” నిర్మాత..??

Advertisements
Share

Bholaa Shankar: ఆగస్టు నెలలో మెగాస్టార్ చిరంజీవి… మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన “భోళా శంకర్” విడుదలయ్య అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే. వరుస పెట్టి రెండు సీట్లు వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ సినిమాలతో మంచి జోరు మీద ఉన్న చిరంజీవి “భోళా శంకర్”తో హ్యాట్రిక్ కొట్టాలని భావించాడు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అన్నా చెల్లెలు సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి చెల్లెల పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. తమన్నా హీరోయిన్. అయితే సినిమా ఏ ఒక్కరిని అలరించలేకపోయింది. తమిళంలో అజిత్ హీరోగా నటించిన “వేదాలం” సినిమాకి.. రీమేక్ గా మెహర్ రమేష్ చిత్రీకరించారు. తెలుగు నేటివీటికి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది.

Advertisements

Producer of Bholaa Shankar in danger zone of sale of assets

అయినా గాని సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను అల్లరించలేకపోయింది. అయితే ఈ సినిమా పరాజయం పాలు కావడంతో నిర్మాత అనిల్ సుంకర ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారట. “భోళా శంకర్” కి పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో… ఆస్తులు అమ్మటానికి అనిల్ సుంకర రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు చెందిన ఫేమస్ తోట విజయవాడ టు హైదరాబాదు రోడ్డులో సూర్యాపేట దగ్గర రాజు గారి తోట చాలా ఫేమస్. అక్కడ ఎక్కువగా దాబాలు ఉంటాయి. మూడు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆ తోటను ఇప్పుడు అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. “భోళా శంకర్” మిగిల్చిన నష్టాలకు ఈ రకంగా ఆర్థికంగా అనిల్ సుంకర నష్టపోయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని పెద్దగా ఎవరు కొనలేదు.

Advertisements

Producer of Bholaa Shankar in danger zone of sale of assets

చిరంజీవి రెమ్యూనరేషన్ కూడా అనిల్ సుంకర ఇప్పటికీ ఇవ్వలేదట. సాధారణంగా ఏ సినిమా అయినా ఫైనాన్స్ మీద నిర్మిస్తారు. విడుదలకు ముందు అన్ని ఏరియాల్లో అమ్మి నాన్ దీయేటర్ డబ్బులు సమకూర్చి.. ఫైనాన్స్ క్లియర్ చేస్తారు. “భోళా శంకర్” సినిమా నీ అటు నైజా మీడియాలో ఇటు ఓవర్సీస్ లో ఎవరో కూడా కొనలేదని చేతులెత్తేయడం జరిగింది. ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో పాటు సినిమా శాటిలైట్ కూడా అమ్ముడు పోలేదట. ఈ రకంగా నష్టాలను పోర్చుకోవడానికి.. అనిల్ సుంకర ఆస్తుల అమ్ముకునే పరిస్థితికి దిగజారినట్లు వార్తలు వస్తున్నాయి.


Share
Advertisements

Related posts

Priya Bhavani Shankar New Gallerys

Gallery Desk

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి ఆదివారం స్పెషల్ స్టోరీ..!! వచ్చేవారం ఊహకందని ట్విస్ట్ ఇదే..!!

bharani jella

Jagapathi babu: పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన జగపతి బాబు..??

sekhar