న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్‌పై ఆ నిర్మాత చేసిన షాకింగ్ కామెంట్స్‌కు ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు..!

Share

Prabhas: ప్రభాస్‌పై ఆ నిర్మాత చేసిన షాకింగ్ కామెంట్స్‌కు ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. అవును నిజంగా ప్రభాస్ అలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారట. ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలలో పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ చిత్రాలున్నాయి. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న రాధే శ్యామ్ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరి. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సంక్రాంతికి 7 భాషలలో రిలీజ్ కావాల్సిన సినిమా ఆగిపోయింది. ఇది పాన్ ఇండియన్ సినిమా.

producer shocking comments on prabhas
producer shocking comments on prabhas

బాలీవుడ్‌లో ఆదిపురుష్ సినిమా చేస్తుండగా..దీనికి బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ లాంటి క్రేజీ స్టార్స్ నటిస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమాగా సౌత్ అండ్ హిందీ భాషలతో పాటు హాలీవుడ్‌లోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 11న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇక సలార్ అనే యాక్షన్ చిత్రంలో నటిస్తుండగా దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో 5 భాషలలో రిలీజ్ కానుంది.

Prabhas: ప్రభాస్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ తప్ప తెలుగు సినిమాలు చేయరా ..!

వీటికంటే భారీ ప్రాజెక్ట్ సైన్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె. నాగ్ అశ్విన్ దర్శకుడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ 400 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో హాలీవుడ్ మేకర్స్ సినిమాలు చేసేందుకు వస్తారని.. రానున్న రోజుల్లో ప్రభాస్ హాలీవుడ్ సినిమాలు తప్ప మన సినిమాలు చేయడం కాస్త కష్టమని అశ్వనీదత్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇది అభిమానులకు రెట్టింపు ఉత్సాహం ఇస్తోంది. మరి అశ్వనీదత్ చెప్పినట్టు ప్రభాస్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ తప్ప తెలుగు సినిమాలు చేయరా అనేది కాలమే నిర్ణయిస్తుంది.


Share

Related posts

సబ్బం హరి కి షాక్ ట్రీట్మెంట్ ! అసలేం జరిగిందంటే!!

Yandamuri

YS Sharmila: అప్పుడే చేతులు ఎత్తేసిన ష‌ర్మిల‌..పార్టీ నేత‌ల షాక్‌

sridhar

అందాల అదా శర్మ ను అందుకే అందరూ దూరం పెట్టారట ..?

GRK