Nayanthara: హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2003లో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన నయనతార దాదాపు రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది . పెళ్లయిన గాని హీరోయిన్ అవకాశాలు అందుకుంటూ వరుస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలు తన ఖాతాలో వేసుకుంటూ ఉంది. రీసెంట్ గా షారుక్ నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్ గా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా పోరాడింది. సీనియర్ హీరోయిన్ అయినా గాని నేటితరం హీరోయిన్స్ కి నయన్ గట్టిగా పోటీ ఇస్తూనే ఉంది. భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతోమంది బ్యూటీలు వస్తువు వెళ్తున్న కానీ నయనతారకు పోటీగా మాత్రం ఎవ్వరు నిలబడటం లేదు. ఎందుకంటే నయనతార తో సినిమా ఫిక్స్ చేసుకుంటే మాత్రం దర్శక నిర్మాతలు మరో ఆలోచన చేయడం లేదు.
ప్రస్తుతం ఆమెకు ఆల్టర్నేటివ్ గా ఏ హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో లేరు. మంచి స్పీడ్ మీద దూసుకుపోతూ ఉంది. ఒకపక్క తన వయసు పెరుగుతున్న గాని.. మరోపక్క రెమ్యూనరేషన్ పెంచుకుంటూనే ఉంది. జయపజయాలతో సంబంధం లేకుండా నయనతార తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. దీంతో దక్షిణాది చలనచిత్ర రంగంలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు టాప్ హీరోయిన్స్ లిస్టులో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. నయనతార రెమ్యూనరేషన్ దాదాపు ఒకో సినిమాకి 6 కోట్లకు పైగానే తీసుకుంటూ ఉంది. అంతేకాదు రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటుందట అసలు సినిమా ప్రమోషన్ వాటికి రానని ముందుగానే.. నిర్మాతలకు చెప్పేస్తుంటదట.
అయితే ప్రస్తుతం సినిమాకి ప్రమోషన్ కార్యక్రమాలే చాలా కీలకమవుతూ ఉండటంతో.. హీరోయిన్ గా ఫిక్స్ అయ్యి నయనతార దగ్గరికి వస్తున్న ప్రొడ్యూసర్లు ప్రమోషన్ చేయనని నయనతార చెబుతూ ఉండటంతో నిర్మాతలు దండం పెట్టేస్తున్నారట. హీరోయిన్ గా రెమ్యూనరేషన్ ఇస్తాం దానికి అదనంగా ప్రమోషన్ కార్యక్రమాలకు వస్తే ఎక్స్ ట్రా అమౌంట్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నా గానీ.. నయనతార ఒప్పుకోవటం లేదట. సినిమా మాత్రమే ప్రమోషన్స్ నావల్ల కాదు అంటూ హీరోయిన్ నయనతార నిర్మాతలకు చెప్పడం మాత్రమే కాదు.. చాలా అవకాశాలు కూడా వదిలేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.