Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయ మరో పక్క సినిమా రంగంలో బిజీబిజీగా గడుపుతున్నారు. జనసేన అధినేతగా ఆంధ్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈసారి జరగబోయే ఎన్నికలలో కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని మంచి పట్టుదల మీద ఉన్నారు. ఇదే సమయంలో పార్టీ తరఫున వారాహి యాత్ర పేరిట కార్యకర్తలను అదే విధంగా నాయకులను ఎన్నికలకు సిద్ధం చేస్తూ ఉన్నారు. జరగబోయే ఎన్నికలలో వైఎస్ జగన్ ని కచ్చితంగా ఓడించాలని ఇదే తన టార్గెట్ అని తెలియజేయడం జరిగింది. మరోపక్క పార్టీని నడిపించుకోవడానికి సినిమాలు చేస్తున్నట్లు తెలిపిన పవన్ ఆల్రెడీ ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ మీదకి తీసుకురావటం తెలిసిందే.
ఈ క్రమంలో కాల్ షీట్స్ విషయంలో.. పవన్ తీసుకున్న తాజా నిర్ణయం ఆ సినిమా నిర్మాతలకు తలనొప్పిగా మారినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. విషయంలోకి వెళ్తే రెమ్యూనరేషన్ బట్టి.. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తున్నారట. దీంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పవన్ కళ్యాణ్ కి అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వటంతో.. ఆ బ్యానర్ లో చేస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ చాలా సరవేగంగా జరుగుతూ ఉందట. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇదే సమయంలో 2020లో ప్రారంభించిన “హరిహర వీరమల్లు” సినిమా షూటింగ్ ఆలస్యం కావటానికి ఆ సినిమా నిర్మాత ఏఎం రత్నం రెమ్యూనరేషన్ ఇవ్వకపోవటమే అనే టాక్ నడుస్తుంది.
అంతేకాదు సినిమా డైరెక్టర్ క్రిష్ ఆలోచనలు మరియు పవన్ కళ్యాణ్ టైమింగ్ కూడా సరిగ్గా కలవడం లేదట. దీంతో పవన్ పెడుతున్న కండిషన్స్ కూడా.. “హరిహర వీరమల్లు” ఆలస్యం కావడానికి ఒక కారణమని అంటున్నారు. ఈ పరిణామాలతో హరిహర వీరమల్లు కంటే…”ఉస్తాద్ భగత్ సింగ్”, “ఓజీ” సినిమాలను కంప్లీట్ చేయడానికి పవన్ ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉండటంతో ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో డబ్బులు అవసరం ఎక్కువ కావడంతో “OG” చిత్రానికి.. 100 కోట్లు అదేవిధంగా “ఉస్తాద్ భగత్ సింగ్” కి 70 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.