సినిమా

Bala Krishna: మా బాలయ్య మంచి మారాజు అంటున్న నిర్మాతలు.. ఎందుకో తెలుసుకోండి!

Share

Bala Krishna: టాలీవుడ్ హీరోలు ఎంతమందున్నా, బాలయ్య ప్రత్యేకం అంటున్నారు అక్కడి నిర్మాతలు. అవును.. మీరు వింటున్నది నిజమే. బాలీవుడ్ తరువాత రెమ్యునరేషన్స్ విషయంలో అంత స్థాయిలో ఇక్కడే తీసుకుంటారు మన హీరోలు. రానురాను అది మరీ ఎక్కువగా పెరిగిపోతుంది. కాస్త క్రేజ్ వచ్చిన కొత్త హీరో కూడా రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నమాదిరిగా వ్యవహరిస్తున్నారు టాలీవుడ్ హీరోలు. అలాంటి సమయంలో కూడా ఎంతో సీనియారిటీ వున్న బాలయ్య తన రెమ్యునరేషన్ విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నదంటే అది గొప్ప విషయంగానే పరిగణించొచ్చు.

నిర్మాతల బాగోగులే మాకు కావాలి:

అవును.. మా బాలయ్య మంచి మారాజు అంటున్నారు తెలుగు నిర్మాతలు. ఒక మోస్తరు హిట్ రాగానే డబ్బుల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు మన హీరోలు. ఇలాంటి తరుణంలో సీనియర్ హీరో పైగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రంతో భారీ హిట్టుని సైతం కొల్లగొట్టిన నటసింహం బాలకృష్ణ ఏమేర తన రెమ్యునరేషన్ ని పెంచాలి? కానీ అలా చేయడంలేదు అంటున్నారు తెలుగు చిత్రం సినీ నిర్మాతల సంఘం. గతంలో బాలకృష్ణ ‘అఖండ’ సినిమా కోసం సుమారు 11 కోట్లు అందుకున్నాడట. అయితే ఇప్పుడు #NBK107 కోసం ఆయన జస్ట్ ఓ కోటి పెంచి 12 కోట్లు మాత్రమే అందుకోబోతునన్నారని సమాచారం.

బాలయ్య నిర్మాతల హీరో:

ఇకపోతే, టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా వెచ్చించి సినిమాలు చేస్తున్న మైత్రీ నిర్మాతలు.. బ్లాక్ బస్టర్ తర్వాత కూడా బాలయ్య తన రెమ్యునరేషన్ ను 1 కోటి మాత్రమే పెంచడాన్ని చూసి ఎంతో ఆశ్చర్యానికి లోనైయ్యారట. ఈ విషయాన్ని తోటి నిర్మాతల దగ్గర ప్రస్తావిస్తూ మన హీరోని కొనియాడుతున్నారట. కాగా #NBK107 చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా హై ఇంటెన్స్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీస్తున్న విషయం తెలిసినదే. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఒక పాత్రకు సంబంధించిన లుక్ ఆకట్టుకుంది. శృతి హాసన్ మన హీరోకు హీరోయిన్ గా నటిస్తోంది.


Share

Related posts

Prabhas : ప్రభాస్ సలార్ లో శృతిహాసన్ కి కళ్ళు బైర్లు కమ్మే రెమ్యూనరేషన్ ..?

GRK

Shruti hassan : ప్రభాస్ సినిమా కాబట్టి అంత ఇవ్వాల్సిందే, పట్టుబడుతోన్న శృతిహాసన్?

Teja

RGV: రామ్ గోపాల్ వర్మ ‘ హాట్’ డ్యాన్స్ వీడియో మీద స్పందించిన శ్రీకాంత్ అయ్యంగార్ ” ఆ రోజు రాత్రి ” అంటూ

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar