కేజిఎఫ్, కేజిఎఫ్ 2 సినిమాలతో భారీ లాభాలు సాధించింది హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ. ఈ రెండు సినిమాలతో దర్శకుడు మరియు హీరోకి ఎంత పేరు వచ్చిందో అదే స్థాయిలో హోంబలే ఫిలిమ్స్ కి కూడా రావటం జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్మాణ సంస్థకి కేజిఎఫ్ తో మంచి గుర్తింపు లభించింది. అటువంటి “హోంబలే ఫిలిమ్స్” సంస్థ దక్షిణాదిలో సంచలన మల్టీస్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్ మొదలుకొని సౌత్ వరకు మల్టీ స్టార్ సినిమాలు వరుస పెట్టి వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో దక్షిణాదిలో స్టార్ హీరోలు సూర్య ఇంకా దుల్కర్ సల్మాన్ లతో మల్టీ స్టార్లర్ ప్రాజెక్ట్ చేయడానికి హోంబలే ఫిలిమ్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోంది. “హోంబలే ఫిలిమ్స్” ఇప్పటికే తెలుగులో ప్రభాస్ హీరోగా “సలార్” సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
ఇక తమిళంలో ఈ మల్టీ స్టార్లర్ ప్రాజెక్ట్ చేత ఎంట్రీ ఇవ్వాలని సిద్ధమైనట్లు సమాచారం. “ఆకాశమే నీ హద్దురా” సినిమా ఫేమ్ సుధా కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారట. సూర్యకి ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక దుల్కర్ సల్మాన్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. కచ్చితంగా అని అనుకున్నట్లు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే సౌత్ ఇండియాలో “RRR” కంటే అతిపెద్ద సెన్సేషనల్ మల్టీ స్టార్ ప్రాజెక్టు అవుతుందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. క్రేజ్ పరంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే.. సూర్య ఇంకా దుల్కర్ సల్మాన్ కి ఏటువంటి పాన్ ఇండియా చేయకపోయినా.. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆ దిశగా చూసుకుంటే కచ్చితంగా “RRR” నీ మించిన సినిమా అవుతుందని.. అంత మాత్రమే కాదు బడ్జెట్ కూడా “RRR” కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టే ఆలోచనలో హాంబలే ఫిలిమ్స్ సంస్థ ఉన్నట్లు టాక్.