ప్రముఖ ఛానలో నిర్వహించే భారీ ఎంటర్టైనింగ్ రియాలిటీ షో బిగ్ బాస్. 100 రోజుల పాటు నిర్వహించే ఈ షోలో గొడవలు.. గారాబాలు..ప్రేమలు..పంతాలు…ఇలా మనలో ఉన్న అన్ని ఎమోషన్స్ కి బయటకు వచ్చేలా షో సాగుతుందన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇంత పెద్ద రియాలిటి షో లో కాంట్రవర్సీలు ఎక్కువే. కంప్లైంట్స్, కేసులు …అవుతుంటాయి. ఇంకా చెప్పాలంటే మన తెలుగు కంటే హిందీ ..తమిళ భాషల్లో ఇంకా కాంట్రవర్సీలు ఎక్కువ.
అయినా జనాలలో భారీ బడ్జెట్ సినిమా…సూపర్ హిట్ సినిమా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది ఈ బిగ్ బాస్ రియాలిటీ షో. ఇప్పటికే తెలుగులో సక్సస్ ఫుల్ గా మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ త్వరలో సీజన్ 4 కి సన్నాహాలు చేస్తున్నారు యాజమాన్యం. దీంతో రక రకాల వార్తలు మొదలైపోయాయి. ఈ సారి హోస్ట్ వీళ్ళే …ఇంత రెమ్యూనరేషన్ …వీళ్ళే పార్టిసిపెంట్స్ అంటూ సోషల్ మీడియాలో చాలా మంది పేర్లు ప్రచారం జరుగుతుంది.
ఇంతలోనే గత సీజన్ లో పాల్గొన్న బ్యూటి పునర్నవి భూపాలం ఈ షో మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ 3 లో నాగార్జున కి బాగా ఇష్టమైన కంటెస్టెంట్ గా పునర్నవి బాగా ఫేం ని సంపాదించుకుంది. అంతేకాదు తన అందం తో జనాలని బాగా అట్రాక్ట్ చేసింది. రాహుల్ సిప్లిగంజ్ తో ఏదో ఉంది అంటూ ఆ రకకంగాను సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే షోలో రోజు మొత్తం లో చాలా జరుగుతుంది. కాని అది మొత్తం ఎడిట్ చేసి ఓ గంట మాత్రమే టెలికాస్ట్ చేస్తారని దాదాపుగా ఇదొక ఫేక్ షో అంటూ వ్యాఖ్యలు చేసింది.
అయితే సీజన్ 3 కంప్లీటై ఇంతకాలం అవుతున్నా ఇన్నాళ్ళు ఎక్కడా కనిపించని పునర్నవి ఇప్పుడు వచ్చి ఈ షో మీద ఇలా కామెంట్స్ చేయడమేంటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ లో కనిపించిన పునర్నవి మళ్ళీ ఇప్పటికి సినిమాలలో గాని..సీరియల్స్ లో గాని …ఈవెంట్స్ లో గాని కనిపించలేదు. ఇక త్వరలో మొదలవబోతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. సీజన్ 3 నిర్వహించన హౌజ్ లోనే సీజన్ 4 ని నిర్వహించబోతున్నారట.