డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిల డిఫరెంట్ కాంబినేషన్లో రీసెంట్ గా అనౌన్స్ అయిన సినిమా “ఇస్మార్ట్ శంకర్”. అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ సృష్టించిన ఈ కలయికలో సినీ అభిమానుల్లో భారీ అంచనాలని సృష్టించింది. వరస ఫ్లాప్స్ లో పూరి పూర్తిగా ఈ కథ కోసమే తన కేవ్ లో కూర్చోని కథని సిద్ధం చేసాడని, పక్క హైద్రాబాదీగా రామ్ కనిపించడం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చిత్ర వర్గం నుంచి వినిపిస్తున్న సమాచారం.
అదిరిపోయే కథా కథనాలు రెడి చేసిన పూరీ, ఇస్మార్ట్ శంకర్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. త్వరలో రెగులర్ షూటింగ్ ప్రారంభించనున్న ఇస్మార్ట్ శంకర్ పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ నుంచి బయటకి వచ్చిన రామ్ స్టిల్స్ చూస్తుంటే పూరి మరో పోకిరి లాంటి సినిమాని తీస్తున్నాడు అనిపించకమానదు. పూరి, రామ్ మాత్రమే కాకుండా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఉన్న మరో ప్రధాన బలం మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, జగన్ చేసిన ఎన్నో హిట్ సినిమాలకి మణి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ కలయిక మరో హిట్ ఇస్తుందని సినీ అభిమానులు అనుకుంటున్నారు. మరి పూరీ, రామ్, మణిశర్మ కలిసి ఇస్మార్ట్ శంకర్ ని సూపర్ హట్ మూవీగా నిలబెడతారేమో చూడాలి.