Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాశ్ పూరి తాజా చిత్రం `చోర్ బజార్`. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తన కొడుకు సినిమా విడుదల అవుతున్నప్పటికీ పూరి జగన్నాథ్ ఏమాత్రం పట్టించుకోలేదు.
దాంతో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సొంత కొడుకు సినిమాని ప్రమోట్ చేసుకునే తీరిక కూడా పూరీ జగన్నాథ్‌కు లేదా అంటూ `చోర్ బజార్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిలదీసేశాడు. కుటుంబం తర్వాతే ఎవరైనా. మనం సంపాదన వాళ్ళ కోసమే అంటూ చురకలు వేశారు. అయితే బండ్ల గణేష్ వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలకు, చర్చలకు దారి తీశాయి.
ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలపై పూరీ జగన్నాథ్ డైరెక్ట్‌గా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ, తాజాగా బయటకు వచ్చిన పూరీ మ్యూజింగ్ వింటే మాత్రం బండ్ల గణేష్‌కు ఆయన ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడనే అంటున్నారు నెటిజన్లు. అసలింతకీ పూరీ మ్యూజింగ్‌లో ఏముందంటే..“గుర్తు పెట్టుకోండి! మన నాలుక కదులుతున్నంత సేపూ మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే, జీవితంలో ఎక్కువ టైమ్ లిజనర్స్ గా ఉంటే మంచిది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీస్ పీపుల్ కావచ్చు, ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి.
చీప్‌గా వాగొద్దు, చీప్‌గా బిహేవ్ చేయవద్దు. మన వాగుడు మన కెరీర్ ను, మన క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. మీకు సుమతి శతకం గుర్తుండే ఉంటుంది. `నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి` అని.. తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. నీ జీవితం, మరణం నీ నాలుక మీద ఆధారపడి ఉంటాయి“ అంటూ అందులో పూరీ చెప్పుకొచ్చారు. బండ్ల పేరును పూరీ ఎక్కడా ప్రస్తావించకపోయినా.. పూరీ వార్నింగ్ ఆయనకే అంటూ ప్రచారం జరుగుతోంది.
https://www.instagram.com/reel/CfMMYCGp066/?utm_source=ig_web_copy_link
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…