హిట్ కొట్టి మాట్లాడండి

Share

పూరి జగన్నాధ్, హీరోని ఎలివేట్ చేయడంలో దిట్ట. ఎవరు అవునన్నా కాదన్నా హీరోని అద్భుతంగా చూపించడంలో, కొత్తగా ప్రెజెంట్ చేయడంలో పూరీని మించిన దర్శకుడు లేరు. అయన డైరెక్ట్ చేసిన ఏ సినిమా చుసిన ఇది నిజమని చెప్పకుండా ఉండలేము. పూరి సినిమాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది… హీరోని పోకిరిగా చూపించినా, బుజ్జిగాడిని చేసినా, అందరితో ఇడియట్ అనిపించినా హిట్ అందుకోవడం ఆయనకి మాత్రమే సాధ్యం. అందుకే పూరి సినిమా వస్తుంది అంటే హీరోలతో సంబంధం లేకుండా థియేటర్స్ దగ్గర ఆడియన్స్ కనిపిస్తారు.

ఒకప్పుడు హిట్స్ కి, ఇండస్ట్రీ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పూరి జగన్నాధ్ తో సినిమా చేయాలని స్టార్ హీరోలు కూడా ప్లాన్స్ వేసుకున్నారు. హీరోలతో సమానంగా ఫాలోయింగ్ పెంచుకున్న పూరికి గత కొంత కాలంగా టైం బాగోలేదు, ఏ సినిమా చేసినా, ఎంత కష్టపడినా హిట్ మాత్రం దక్కట్లేదు. రీసెంట్ గా మెహబూబా సినిమాతో అయినా పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటే భారీ ఫ్లాప్ ఫేస్ చేసి అభిమానులని నిరాశపరిచాడు. ఈ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న పూరి, తన కేవ్ లోనే కూర్చొని స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఏ కథని అని అయినా చాలా త్వరగా రాసే పూరి, ఇంత టైం తీసుకోవడంతో ఏ హీరో కోసం కథ సిద్ధం చేస్తున్నాడో అని అందరూ ఎదురు చూశారు.

పూరి చాలా సీరియస్ గా రెడీ చేసిన ఆ స్క్రిప్ట్ ఎనర్జిటిక్ హీరో రామ్ కోసమని ఇండస్ట్రీ వర్గాలు చాలా రోజులుగా అనుకుంటున్నా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆ విషయాన్నీ అందరూ లైట్ తీసుకున్నారు. స్క్రిప్ట్ పూర్తిగా కంప్లీట్ కావడంతో, రామ్ పూరిల కాంబినేషన్ గురించి పూరి టూరింగ్ టాకీస్ నుంచి అఫీషియల్ న్యూస్ బయటకి వచ్చేసింది. త్వరలో మూవీ షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేసి హిట్ అందుకోవాలని పూరి చూస్తున్నాడు. రామ్ కి కూడా ఇప్పుడు అర్జెంటుగా ఒక హిట్ కావాలి కాబట్టి, పూరి సినిమా కోసం పూర్తిగా లుక్ మార్చుకొని కొత్తగా కనిపించడానికి సిద్దమవుతున్నాడు. మరి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న ఈ ఇద్దరు కలిసి హిట్ ఇస్తారేమో చూడాలి.


Share

Related posts

ఇన్‌స్టాగ్రామ్‌లోకి చెర్రీ

Siva Prasad

Induvadana: ఇంట్రెస్టింగ్ గా ఇందువదన కాన్సెప్ట్ పోస్టర్..!!

bharani jella

రాజమౌళి ని కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఇంత టెన్షన్ పెడుతుందని ఊహించలేదే .. తేడా జరిగితే అంతే ..?

GRK

Leave a Comment