మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రముఖులు సినీ సెలబ్రిటీలు భారీగా శుభాకాంక్షలు తెలియజేశారు. గత రెండు సంవత్సరాలు పరిస్థితులు అనుకూలించని నేపథ్యంలో ప్రస్తుతం అంతా సాధారణ వాతావరణం నెలకొనడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున చిరంజీవి జన్మదిన వేడుకలు అభిమానులు చేశారు. ఈ సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీడియో రూపంలో చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో మర్చిపోలేని ఒక అనుభవాన్ని పంచుకున్నారు. చిరంజీవి గారి ఇంటి పక్కనే తన ఆఫీసు ఉండేదని.. ఒకానొక రోజు ఒక చిన్న కారులో చిరంజీవి గారు తన ఆఫీసుకు వచ్చి తనని ఎక్కించుకొని.. రైడ్ కి వెళ్లడం జరిగిందని తెలిపారు.
అయితే ఎక్కడికి అని అన్నయ్య అంటూ అడిగాను. దానికి చిరంజీవి గారు నాకు తెలియదు.. అని రిప్లై ఇచ్చారు. అయితే మాదాపూర్ వైపు కార్ పోనిస్తు పాన్ తినాలని ఉంది. ఎక్కడైనా షాప్ ఉంటే చూద్దామని ఒక నిర్మానుష్యమైన… ప్రదేశంలోకి వెళ్ళాం. అక్కడ ఎవ్వరూ లేరు ఒక్క పాన్ షాప్ మాత్రమే ఉంది. అయితే ఆ పాన్ షాప్ లో పనిచేసే వ్యక్తి చిరంజీవి గారిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. వెంటనే కార్ దగ్గరికి రావడం జరిగింది. మెగాస్టార్ మెగాస్టార్ అంటూ దగ్గరికి వచ్చేసాడు. చిరంజీవి నాకు ఒక పాన్ కావాలి అని అడగడం జరిగింది. దానికి వెంటనే ఆ షాప్ కుర్రోడు.. మెగాస్టార్ మెగాస్టార్ అంటూ అరుస్తూనే తమలపాకు తీశాడు. మళ్లీ చుట్టుపక్కల చూస్తూ మెగాస్టార్ చిరంజీవి అంటూ గట్టిగా అరుస్తూ.. పాన్ కట్టడం జరిగింది.
ఆ సందర్భాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. అతని దగ్గర పాన్ తీసుకుని.. అతనికి 200 ఇచ్చేయడం జరిగింది. కారు వెనక్కి వచ్చేస్తున్నా గాని అతను గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అసలు ఆ పాన్ షాప్ కుర్రాడు.. తన దగ్గరికి చిరంజీవి వస్తాడని అస్సలు ఊహించి ఉండడు. ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోవాలని అతడు పడ్డ కష్టం.. నేను ఎప్పటికీ మర్చిపోలేను కానీ ఆ సందర్భాన్ని బాగా ఎంజాయ్ చేశాను. అతను ఎక్కడో ఉండు ఉంటాడు. కచ్చితంగా ఈ వీడియో చూస్తే బాగుంటుంది. అన్నయ్య నువ్వు ఇటువంటి జన్మదిన వేడుకలు అనేకమైనవి జరుపుకోవాలని తనదైన శైలిలో అప్పటి విషయాన్ని గుర్తు చేస్తూ వీడియోలో తెలియజేశారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!